విజయ్ వర్మకు తమన్నాను మించి అందం దొరికిందా?
గత కొంతకాలంగా తమన్నా- విజయ్ వర్మ బ్రేకప్ గురించి వేడెక్కించే వార్తలు వచ్చాయి.;
అవును.. తమన్నా కంటే అందమైనది మరొకటి విజయ్ వర్మకు దొరికింది. అతడు ఇప్పుడు పండగ చేసుకుంటున్నాడు! ప్రస్తుతం అతడు, అతడి కుటుంబం ఆనంద డోలికల్లో మునిగి తేల్తున్నారు. అయితే అంత అందంగా ఉండేది దేనిని కనుగొన్నాడు? వివరాల్లోకి వెళితే...
గత కొంతకాలంగా తమన్నా- విజయ్ వర్మ బ్రేకప్ గురించి వేడెక్కించే వార్తలు వచ్చాయి. ఇప్పుడిప్పుడే ఆ ఇద్దరి బ్రేకప్ వ్యవహారాన్ని అభిమానులు కూడా మర్చిపోతున్నారు. ఇంతలోనే ఇప్పుడు విజయ్ వేడెక్కించే మరో వార్త చెప్పాడు. అది అతడి సొంత ఇల్లు. అందమైన ఇల్లు. ఏ నటుడికైనా ఒక డ్రీమ్ హౌస్ కావాలి. అది కూడా ముంబైలో టాప్ సెలబ్రిటీలు నివసించే విలాసవంతమైన ఏరియాలో సీఫేసింగ్ లో అందమైన అపార్ట్ మెంట్ సొంతం కావాలి.
ఇప్పుడు అలాంటి ఒక దానిని విజయ్ వర్మ సొంతం చేసుకున్నాడు. ఇది తమన్నా కంటే బ్యూటిఫుల్. ఇప్పుడు విజయ్ వర్మ తన తల్లితో కలిసి ఈ అపార్ట్ మెంట్ లోకి తన తల్లితో పాటు గృహప్రవేశం చేసిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందే ఫరా ఖాన్, ఆమె వంటమనిషి దిలీప్ ముంబైలోని నటుడు విజయ్ వర్మ కొత్త అపార్ట్‌మెంట్‌ను సందర్శించారు. అరేబియా సముద్రానికి ఎదురుగా, ఇప్పుడు విజయ్ కొత్త నివాసం కళకళలాడుతోంది. జుహూలోని ఈ ఇంటి ఖరీదు కోట్లలో ఉంటుంది. `గల్లీబోయ్` నటుడిగా అతడికి తొలుత గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మీర్జాపూర్ 2లో అతడి నటనకు గొప్ప గుర్తింపు దక్కింది. అటుపై నటుడిగా వెనుదిరిగి చూడలేదు. బ్యాక్ టు బ్యాక్ అవకాశాలతో బిజీ ఆర్టిస్టుగా మారాడు. తమన్నాతో ప్రేమాయణం అతడిని మరింత ఫేమస్ చేసింది. కానీ మిల్కీ బ్యూటీతో ప్రయాణం ఎక్కువకాలం ముందుకు సాగలేదు. అతడు తిరిగి కెరీర్ పైనే ఫోకస్ చేసాడు.
విజయ్ వర్మ తదుపరి కెరీర్ మ్యాటర్స్ పరిశీలిస్తే.. తాజా వెబ్ సిరీస్ `మట్కా కింగ్` షూటింగ్ అధికారికంగా పూర్తయింది. సిద్ధార్థ్ రాయ్ కపూర్ రాయ్ కపూర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సిరీస్ ఈ సంవత్సరం చివర్లో ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. సైరత్ - ఫ్యాండ్రీ ఫేం నాగరాజ్ మంజులే ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు. 1960ల నాటి ముంబైలో జరిగే కథతో మట్కా కింగ్ తెరకెక్కింది. ఈ సిరీస్ మట్కా జూదం నేపథ్యంలో రక్తి కట్టించనుంది. అలాగే `గుస్తాఖ్ ఇష్క్`అనే చిత్రంలోను విజయ్ నటిస్తున్నాడు. విభు పూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ వర్మ, ఫాతిమా సనా షేక్, నసీరుద్దీన్ షా, షరీబ్ హష్మి కీలక పాత్రల్లో నటించారు.