గెలుపుతో నాన్నకు మంచి గిప్టే ఇస్తాడు!
కోలీవుడ్ బాక్సాఫీస్‌ను దశాబ్దాలుగా దమ్మున్న నటనతో, మాస్ ఇమేజ్‌తో ఏలిన దళపతి విజయ్ సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే.
కోలీవుడ్ బాక్సాఫీస్‌ను దశాబ్దాలుగా దమ్మున్న నటనతో, మాస్ ఇమేజ్‌తో ఏలిన దళపతి విజయ్ సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ కొత్త బాధ్యత తీసుకోవడంతో? అతడి జీవితం ఇక రాజకీయాలకే అంకితమని తెలిపోయింది. ఇలాంటి తరుణంలో దళపతి కుటుంబం నుండి వారసుడు జాసన్ సంజయ్ నటుడిగా లెగస్సీని కొనసాగిస్తారనుకుంటే? తనయుడు అందుకు భిన్నమైన ప్రయాణాన్ని ఎంచుకున్నారు. హీరో కు బధులుగా దర్శకుడిగా తెరంగేట్రం చేస్తున్నారు.
తండ్రి బాటలోనే వినోద రంగంలోకి అడుగుపెడుతున్నా? జాసన్ సంజయ్ నటన వైపు కాకుండా డైరెక్షన్ వైపు తన ఆసక్తిని నిరూపించుకుంటున్నారు. విదేశాలలో డైరెక్షన్ - ఫిల్మ్ మేకింగ్‌పై ప్రత్యేక శిక్షణ తీసుకున్న జాసన్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తన తొలి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఒక స్టార్ హీరో కొడుకై ఉండి కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వకుండా దర్శకుడిగా బాధ్యతలు తీసుకోవడం కోలీవుడ్ వర్గాలను ఆకట్టుకుంది.
ఇండస్ట్రీలో తనకంటూ స్వతంత్ర ముద్ర వేసుకోవాలని భావిస్తున్న జాసన్ సంజయ్ డెబ్యూ మూవీ `సిగ్మా` కోసం ఎంతో కష్టపడ్డారని సమాచారం. తండ్రి స్టార్ డమ్‌ను నమ్ముకోకుండా సరికొత్త కథాంశంతో, పక్కా కమర్షియల్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండటంతో దళపతి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
కెరీర్ చివరి అంకంలో ఉన్న తండ్రి విజయ్‌కు తనయుడు జాసన్ సంజయ్ ఈ సినిమా ద్వారా అద్భుతమైన విజయాన్ని బహుమతిగా ఇస్తారని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. విజయ్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నా? టాలెంటెడ్ డైరెక్టర్‌గా తన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి జాసన్ సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా కనుక ఘన విజయం సాధిస్తే కోలీవుడ్‌లో మరో టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ పుట్టుకొచ్చినట్లవుతుంది.
దళపతి విజయ్ కూడా కొడుకు నిర్ణయాన్ని ఆదరించి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. సినిమా షూటింగ్ సమయంలోనూ జాసన్ తీసుకునే సృజనాత్మక నిర్ణయాలకు విజయ్ అండగా నిలిచారనే ప్రచారం ఉంది. తండ్రి అందించిన స్ఫూర్తితో తన స్వశక్తిపై నమ్ముకుంటూ జాసన్ సంజయ్ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న తీరుకు సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. తలపతి వారసుడిగా నటుడిగా కాకుండా దర్శకుడిగా మెగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
తండ్రికి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించాలనే కసితో ఆయన చేసిన తొలి ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా విజయంతో జాసన్ కోలీవుడ్‌లో లాంగ్ రన్ ఇచ్చే దర్శకుడిగా నిలవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంచి విజయంతో డాడ్ విజయ్ కు మంచి గిప్ట్ ఇవ్వాలని సంజయ్ అంతే ఆసక్తిగా ఉన్నారు.