రైట‌ర్ల కోసం స్టార్ వార‌సుడు వేట‌!

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనదైన ముద్ర వేసేందుకు పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు

Update: 2026-10-24 22:30 GMT

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనదైన ముద్ర వేసేందుకు పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు. తండ్రి పేరును వాడుకోకుండా సొంత ప్రతిభతో విజయాన్ని అందుకోవాలని తాపత్రయపడుతున్న స్టార్ వారసుడు ప్రస్తుతం తదుపరి స్ట్రీమింగ్ సిరీస్ కోసం కొత్త రచయితల కోసం అన్వేషి స్తున్నారు. ఉన్న పాత రచయితల కంటే కొత్త ఆలోచనలతో వచ్చే యువ రక్తాన్ని ప్రోత్సహించాలని ఆర్య‌న్ నిర్ణయించుకోవడం విశేషం.

తొలి వెబ్ ప్రాజెక్ట్ `ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్` పనులను విజయవంతంగా పూర్తి చేసిన ఆర్యన్ తన రెండో ప్రాజెక్ట్‌ను మరింత భారీగా.. వైవిధ్యంగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి డైరెక్షన్ బాధ్యతలకే పరిమితం కాకుండా కథా చర్చల్లో స్వయంగా పాల్గొని స్క్రిప్ట్‌ను దగ్గరుండి తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. అందుకోసమే వినూత్న దృక్పథం, సమకాలీన ఆలోచనలు ఉన్న కొత్త రచయితల బృందాన్ని తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

నేటి తరం ఓటీటీ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా.. అత్యంత ఆసక్తికరమైన కంటెంట్‌ను అందించడమే లక్ష్యంగా ఆర్యన్ ఖాన్ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ట్రెడిషనల్ రచయితలు రాసే శైలికి భిన్నంగా, సరికొత్త కోణంలో కథలను చెప్పగల యువ రచయితలకు ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సెర్చ్ ద్వారా వచ్చే ఐడియాలను భవిష్యత్తులో రాబోయే ఇతర డిజెటల్ ప్రాజెక్ట్‌లకు కూడా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఆర్యన్ ఖాన్ కెరీర్ ప్రయాణాన్ని పరిశీలిస్తే.. ఆయన మొదటగా వాయిస్ ఆర్టిస్ట్‌గా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2019లో వచ్చిన `ది లయన్ కింగ్`...2024లో విడుదలైన `ముఫాసా: ది లయన్ కింగ్` చిత్రాలలో సింబా పాత్రకు ఆయన అందించిన వాయిస్ ఓవర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే నటన కంటే కెమెరా వెనుక ఉండి కథలను నడిపించడమే ఆర్య‌న్ అసలు లక్ష్యమని ఇప్పటికే స్పష్టం చేశారు.

ఆ దిశగానే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని `ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్` సిరీస్‌తో షోరూనర్‌గా.. రచయితగా.. దర్శకుడిగా అవతారమెత్తారు. మొదటి ప్రాజెక్ట్‌లోనే షారుఖ్ ఖాన్.. ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి దిగ్గజ నటులు ప్రత్యేక పాత్రల్లో క‌నిపించ‌డంతో ఇండస్ట్రీ వ్యాప్తంగా సిరీస్‌పై క్రేజ్ ఏర్పడింది. అనుకున్న‌ట్లుగానే ఆ ప్లాన్ ఆర్కౌట్ అయింది. రిలీజ్ అనంత‌రం సిరీస్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

Tags:    

Similar News