వారణాసి లో డూప్ ను పక్కన పెట్టి ఆ రిస్కీ షాట్ మహేష్ బాబు చేశాడా?

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మొదటి మూవీతోనే ఆకట్టుకున్నాడు.

Update: 2026-10-24 18:30 GMT

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మొదటి మూవీతోనే ఆకట్టుకున్నాడు. బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాయడంలో ఆయనకంటూ ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. బి,సి సెంటర్ ప్రేక్షకుల అభిరుచి మేరకు తన సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ని సైతం మిళితం చేస్తున్నాడు.

డూప్ లేకుండా రిస్కీ స్టంట్

దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబు కాంబోలో అంతర్జాతీయ అడ్వెంచర్ డ్రామా గా తెరకెక్కుతున్న వారణాసి మూవీ పై సినీ వర్గాల్లోను, ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు నెలకొన్నాయి. 'త్రిబుల్ ఆర్' మూవీతో ఆస్కార్ రేంజ్ లో తన మేకింగ్ ను చూపించిన రాజమౌళి ఈ మూవీని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ విపరీతంగా కష్టపడుతున్నాడట.

మహేష్ కెరీర్ స్టార్టింగ్ నుంచి యాక్షన్ సన్నివేశాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించేవాడు. వారణాసి మూవీ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని మరి షూటింగ్ లో పాల్గొంటున్నాడట. ఇతర దేశాల్లో జరిగే హై రిస్కీ షాట్స్ కోసం విదేశీ ఫైట్ మాస్టర్స్ పర్యవేక్షణలో రోప్స్ కట్టుకొని డూప్ తో సంబంధం లేకుండా తనే ఆ ఫైట్ సీక్వెన్స్ లో పాల్గొనట్టుగా తెలుస్తుంది. ఆయన కెరియర్ స్టార్టింగ్ లోనే నిజం, వన్ నేనొక్కడినే లాంటి సినిమాల్లో కొన్ని రిస్క్ షాట్స్ చేశాడు. సోషల్ మీడియాలో వెలువడుతున్న కథనాల ప్రకారం వారణాసి మూవీలో ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదికి దూకే ఒక రిస్కీ షాట్ ఉందట. బాడీకి రోప్స్ కట్టుకున్నప్పటికి అది డూప్ తో చేద్దామని దర్శకుడు చెప్పిన కూడా మహేష్ బాబు నేను ఓన్ గా చేస్తానని చెప్పి ఆ షాట్ ను సింగిల్ టేక్ లో చేసేసారట.

నిజానికి రాజమౌళి లాంటి దర్శకుడి సినిమాలో సింగిల్ టేక్ లో షాట్ ఓకే అవ్వడం అంటే మామూలు విషయం కాదు. కానీ అన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడంతో ఈ షాట్ సింగిల్ టేక్ లో చేయగలిగారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించాలని చూస్తున్నాడు. ఇప్పటికే హాలీవుడ్ డైరెక్టర్లు సైతం మహేష్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

హాలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తారా?

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా హాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుంది. రాజమౌళి లాంటి దర్శకుడు 'ఆర్ఆర్ఆర్' సినిమాతో హాలీవుడ్ ఇండస్ట్రీలో తన సత్తా చాటుకున్నాడు. మరోసారి ఆయన నుంచి వస్తున్న ఈ ప్రాజెక్టు ఏ మేరకు ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది. హాలీవుడ్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయగలదా లేదా అనేది చూడాలి...

Tags:    

Similar News