మూవీ ఐదు రెట్లు పెద్దదైతే.. మరి రిజల్ట్ సంగతేంటి..

దర్శకుడు రాజమౌళి సినిమా అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. కథ, యాక్షన్, విజువల్స్.. ఇలా ప్రతి విషయంలో ఆయన స్పెషాలిటీ చూపిస్తుంటారు.

Update: 2026-10-24 16:57 GMT

దర్శకుడు రాజమౌళి సినిమా అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. కథ, యాక్షన్, విజువల్స్.. ఇలా ప్రతి విషయంలో ఆయన స్పెషాలిటీ చూపిస్తుంటారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తన రేంజ్ ను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న వారణాసితో మరోసారి అంతకుమించిన ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్‌తో పోలిస్తే వారణాసి ఐదు నుంచి ఆరు రెట్లు పెద్దదిగా ఉంటుందని రాజమౌళి చెప్పడంతో ఆ సినిమాపై ఇంట్రెస్ట్ మరింత పెరిగింది.

అయితే సినిమా స్కేల్ ఐదు రెట్లు పెరిగితే.. రిజల్ట్ కూడా అదే స్థాయిలో ఉంటుందా అనేది ఇప్పుడు అసలు విషయం. ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో తెలుగు సినిమా పేరు మార్మోగింది. అలాంటి సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడంతో వారణాసిపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

భారతీయ పురాణాలు, హిస్టరీ, మోడ్రన్ టెక్నాలజీ కలిపి ఆ కథను రూపొందిస్తున్నారు. వారణాసి నుంచి ఆఫ్రికా, అంటార్కిటికా వరకు స్టోరీ సాగనుండగా.. భారీ యాక్షన్ సీన్స్, కొత్త వరల్డ్ ను చూపించే విజువల్స్‌తో ప్రేక్షకులకు స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని మూవీ టీమ్ భావిస్తోంది. ఐమ్యాక్స్‌ లోనూ సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేయనున్నారు. అయితే సినిమా ఎంత భారీగా తీశారనేది ముఖ్యం కాదు, ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చిందనేదని మెయిన్.

భారీ సెట్లు, ఖర్చుతో కూడిన సీన్, ఫారిన్ కంట్రీస్ లో షూటింగ్ తో సినిమాపై ఆసక్తి పెంచవచ్చు. కానీ కథలో స్ట్రెంత్ లేకపోతే ఆ హైప్ ఎక్కువ సేపు ఉండదు. ప్రేక్షకులు రోల్స్ కు కనెక్ట్ కావాలి. కథలో ఎమోషన్స్ ఉండాలి. సినిమా చూసిన తర్వాత కూడా కొన్ని సన్నివేశాలు గుర్తుండిపోవాలి. అప్పుడే భారీ ప్రయత్నానికి తగిన రిజల్ట్ దక్కుతుంది. అయితే జక్కన్న సినిమాల్లో కథను చెప్పే విధానం, పాత్రలను చూపించే తీరు స్పెషల్ గా ఉంటాయి.

అందుకే ఆయన సినిమాలపై ప్రేక్షకుల్లో నమ్మకం ఉంది. మహేష్ బాబు క్రేజ్ కూడా వారణాసికి మరో స్ట్రెంత్. అయితే ఆర్ఆర్ఆర్‌ తో పోలిస్తే ఐదు నుంచి ఆరు రెట్లు పెద్దదిగా సినిమా ఉంటుందనే మాట అంచనాలు పెంచింది. అదే సమయంలో సినిమా రిజల్ట్ పై అంచనాలు కూడా పెరుగుతాయి. గత సినిమా సాధించిన సక్సెస్ మళ్లీ అందుకోవడం ఒక ఎత్తయితే, దాన్ని మించి ప్రేక్షకులను మెప్పించడం మరో ఎత్తు.

వారణాసి 2027 ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అప్పటివరకు సినిమా నుంచి వచ్చే అప్డేట్స్‌ పై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. భారీ రేంజ్, మహేష్ బాబు క్రేజ్, రాజమౌళి దర్శకత్వం.. ఇవన్నీ సినిమాకు కలిసొచ్చే ఎలిమెంట్సే. కానీ చివరకు ప్రేక్షకులు ఇచ్చే జడ్జిమెంటే అసలైన రిజల్ట్ నిర్ణయిస్తుంది. స్కేల్ ఐదు రెట్లు పెరిగిందని రిజల్ట్ కూడా అంతే పెద్దదవుతుందని చెప్పలేం. ఆ భారీ స్థాయికి తగ్గ స్టోరీ, ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నివేశాలు ఉంటేనే వారణాసి మరో సంచలనంగా నిలిచే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News