కీర్తి సురేష్ 'డోరతీ'.. తెలుగులో తక్కువెందుకు?
ఒక సినిమా విజయం అంటే వసూళ్లు మాత్రమే కాదు.. కొత్త స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కూడా. అయితే, ఇలాంటి ప్రయత్నాలు తెలుగు సినిమాల్లో ఇంకా ఎక్కువగా కనిపించడం లేదు.
ఒక సినిమా విజయం అంటే వసూళ్లు మాత్రమే కాదు.. కొత్త స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కూడా. అయితే, ఇలాంటి ప్రయత్నాలు తెలుగు సినిమాల్లో ఇంకా ఎక్కువగా కనిపించడం లేదు. ముఖ్యంగా సమాజంలోని సెన్సిటివ్ ఎలిమెంట్స్ ను మెయిన్ స్టోరీగా తీసుకునే సినిమాల కౌంట్ తక్కువగానే ఉంటోంది. కీర్తి సురేష్ నటించిన డోరతీ ఇప్పుడు ఆ విషయాన్ని మరోసారి చర్చలోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆ సినిమా నెట్ ఫ్లిక్స్ లో తెలుగులోనూ అందుబాటులో ఉంది.
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన ఆ సినిమా నార్మల్ స్టోరీలకు భిన్నంగా ఉంటుంది. ఇద్దరు స్నేహితుల జీవితాల్లోకి డోరతీ అనే మహిళ వచ్చిన తర్వాత చోటుచేసుకునే మార్పుల చుట్టూ కథ సాగుతుంది. లింగ వివక్ష, సమాజం పెట్టే కట్టుబాట్లు, మనుషుల మధ్య సంబంధాలు వంటి అంశాలు ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. కీర్తి సురేష్ రోల్ నిడివి తక్కువగా ఉన్నప్పటికీ కథలో స్పెషాలిటీ తీసుకొస్తుంది. ఇళయరాజా మ్యూజిక్ కూడా ఎమోషన్స్ స్ట్రాంగ్ గా చూపించింది.
అయితే డోరతీ అందరికీ నచ్చే సాధారణ కమర్షియల్ సినిమా కాదు. స్టోరీ చెప్పే విధానం, ఇందులో డిస్కస్ చేసే ఎలిమెంట్స్ కొందరికి నచ్చితే.. మరికొందరికి నచ్చకపోవచ్చు. అయినప్పటికీ, ప్రేక్షకులకు అలవాటైన స్టోరీలకు భిన్నంగా ఒక కొత్త విషయాన్ని చెప్పాలనే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. ఇలాంటి స్టోరీలు ప్రేక్షకుల్లో చర్చకు దారి తీస్తాయి. మరి తెలుగులో ఇలాంటి సినిమాలు ఎందుకు తక్కువగా వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణాల్లో మార్కెట్ లెక్కలు ఒకటి.
భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే నిర్మాతలు ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకునే స్టోరీల వైపు మొగ్గు చూపుతుంటారు. స్టార్ హీరోలు, యాక్షన్ సీన్స్, సాంగ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి ఎలిమెంట్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. దీంతో సెన్సిటివ్ ఎలిమెంట్స్ ను మెయిన్ స్టోరీగా ఎంచుకోవడానికి కొంత వెనక్కి తగ్గుతున్నారు. దీనికి తోడు సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, వివాదాల భయం కూడా కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది.
ఒక సినిమా స్టోరీపై పూర్తి అవగాహన లేకుండా అభిప్రాయాలు వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో కొత్త ఎలిమెంట్స్ ఎంచుకోవడం నిర్మాతలకు రిస్క్ గా అనిపించవచ్చు. అయితే, ప్రేక్షకులందరూ ఒకే రకమైన సినిమాలు మాత్రమే ఇష్టపడతారని అనుకోవడం కూడా సరికాదు. తెలుగులో ఇలాంటి ప్రయత్నాలు జరగలేదని కాదు. అ! వంటి సినిమాలు కొత్త ఆలోచనలతో వచ్చాయి. మహిళల మధ్య లవ్ రిలేషన్ ను ఆ మూవీలో సెన్సిటివ్ గా చూపించారు.
కానీ ఇలాంటి అంశాలకు సినిమాల్లో మరింత స్థానం దక్కాల్సి ఉంది. కథలో స్త్రెంత్ ఉంటే, పాత్రలు గౌరవంగా చూపిస్తే ప్రేక్షకులు కొత్త విషయాలను ఆదరించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఓటీటీలు భిన్నమైన కథలకు అవకాశమిస్తున్నాయి. థియేటర్లలో మిస్ అయిన సినిమాలను ఇంట్లోనే చూసే అవకాశం ఉండటంతో కొత్త కథలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రేక్షకులకు మరిన్న సెలెక్షన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఏదేమైనా డోరతీ లాంటి సినిమాలు తెలుగులోనూ మరిన్ని భిన్నమైన కథలు రావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి.