రామ్ చరణ్ ఆ రెండు పాత్రల్లో కనిపిస్తే మామూలుగా ఉండదా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కెరియర్ ను స్టార్ట్ చేసిన రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా అవతరించాడు.

Update: 2026-10-25 00:30 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కెరియర్ ను స్టార్ట్ చేసిన రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. 'ఆర్ఆర్ఆర్' మూవీలో రామరాజు పాత్ర తనను ప్రపంచానికి పరిచయం చేసింది. హాలీవుడ్ మేకర్స్ సైతం రామ్ చరణ్ నటనకు ఫిదా అయ్యారు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా విషయంలో ఆయన స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాతో మరోసారి ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేస్తున్నాడు...

వైవిధ్యమైన పాత్రల్లో రామ్ చరణ్...

మెగా పవర్ స్టార్ గా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న రామ్ చరణ్ కెరియర్ లో ఎన్నో డిఫరెంట్ పాత్రలను పోషించాడు. కానీ అతను ఒక రెండు పాత్రల్లో కనిపిస్తే మాత్రం సంచలనమైన రికార్డులు నమోదవుతాయి... 'డార్క్ షేడ్స్ ఉన్న గ్యాంగ్ స్టర్' గా తను కనిపిస్తే చూడాలని అతని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు రామ్ చరణ్ అలాంటి పాత్రలో నటించలేదు. స్టైలిష్ డాన్ లుక్ లో కనిపిస్తే ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అవుతాయి. పాన్ ఇండియాలో సైతం రామ్ చరణ్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. కాబట్టి వాళ్లు సైతం ఈ సినిమా మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలైతే ఉన్నాయి...

రామ్ చరణ్ ఆర్మీ సోల్జర్ గా కనిపిస్తే చూడాలని చాలా మంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు. నిజానికి ఆయన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో బ్రిటిష్ సైన్యం లో పనిచేసే పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. ఈ జనరేషన్లో ఇండియా తరఫున ఫైట్ చేసే ఒక సిన్సియర్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తే చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. డిఫరెంట్ పాత్రలు దొరికితే తన మార్క్ చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తాడని రామ్ చరణ్ అభిమానులు భావిస్తున్నారు. రామ్ చరణ్ ఇప్పటికే వైవిధ్యభరితమైన పాత్రల కోసం వెతుకుతున్నప్పటికి ఆయనకి రూరల్ బ్యాక్ డ్రాప్ కథలే వస్తున్నాయి.

ప్రస్తుతం కొంతమంది దర్శకులు డిఫరెంట్ సబ్జెక్ట్ లతో రామ్ చరణ్ ను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో రామ్ చరణ్ చాలా సంవత్సరాల పాటు గుర్తుండిపోయే క్యారెక్టర్లలో నటించడానికి సిద్ధమవుతున్నాడు...

రామ్ చరణ్ లైనప్

ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న మూవీ పూర్తయిన తర్వాత పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్స్ సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లు రామ్ చరణ్ లైనప్ లో ఉన్నట్టుగా సమాచారం. ఇది వర్కౌట్ అయితే రామ్ చరణ్ క్రేజ్, మార్కెట్ అమాంతం తార స్థాయి కి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి...

Tags:    

Similar News