ప్రభాస్ 'ఫౌజీ'.. 'సీతారామం' మ్యాజిక్ రిపీట్ చేస్తారా?

ఒక లవ్ స్టోరీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోవాలంటే భారీ యాక్షన్ సీన్లు, బడా హీరోలు ఉండాల్సిన అవసరం లేదు

Update: 2026-10-25 02:30 GMT

ఒక లవ్ స్టోరీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోవాలంటే భారీ యాక్షన్ సీన్లు, బడా హీరోలు ఉండాల్సిన అవసరం లేదు. కథలో ఎమోషన్స్ ఉంటే చాలు.. ప్రేక్షకులు ఆ సినిమాను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. దీనికి మంచి ఎగ్జాంపుల్ 'సీతారామం'. పెద్ద అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఇప్పుడు ఇదే దర్శకుడు హను రాఘవపూడి 'ఫౌజీ' మూవీ చేస్తున్నారు. దీంతో ఆ సినిమాపై అంచనాలు పెరిగాయి.

నిజానికి హను రాఘవపూడి పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేది 'సీతారామం' మూవీనే. అంతకుముందు ఆయన 'అందాల రాక్షసి', 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ', 'పడి పడి లేచె మనసు' వంటి సినిమాలు చేశారు. కానీ సీతారామం ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. అందమైన ప్రేమకథ, మనసుకు హత్తుకునే సీన్స్, మ్యూజిక్, క్యాస్టింగ్ యాక్టింగ్.. ఇలా ప్రతి ఎలిమెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇప్పుడు హను నుంచి వస్తున్న ఫౌజీపై కూడా ప్రేక్షకులు ఇలాంటి అంచనాలే పెట్టుకున్నారు. అయితే, ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరో కావడం మరో స్పెషాలిటీ. ఆయనను హను డైరక్షన్ లో బిగ్ స్క్రీన్ పై చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ కూడా సినిమాపై హైప్ పెంచింది. కానీ, ఆ వీడియో చూసిన తర్వాత కొన్ని డౌట్స్ కూడా మొదలయ్యాయి.

సినిమా కథ ఎలా ఉండబోతోంది, లవ్ స్టోరీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, హను తనదైన ఎమోషన్స్ ను ఇందులోనూ చూపిస్తారా అనే చర్చ జరుగుతోంది. ఫౌజీ బ్యాక్ డ్రాప్, ఇప్పటివరకు కనిపించిన సీన్స్ చూస్తుంటే ఇది హను గత సినిమాలకు భిన్నంగా ఉండేలా కనిపిస్తోంది. అయితే, స్టోరీలో బ్యాక్ డ్రాప్ మారినంత మాత్రాన దర్శకుడి స్టైల్ మారిపోవాల్సిన అవసరం లేదు.

సీతారామంలో కూడా ప్రేమకథ చుట్టూ మరిన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది మాత్రం అందులోని ఎమోషన్సే. ఫౌజీలోనూ అలాంటి స్ట్రాంగ్ సీన్స్ ఉంటే సినిమా మరింత స్పెషల్ గా నిలిచే అవకాశం ఉంటుంది. మరోవైపు, గ్లింప్స్‌ లో కనిపించిన కొన్ని ఎలిమెంట్స్ పై కూడా ప్రేక్షకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే కొన్ని మినిట్స్ వీడియో చూసి మూవీపై ఒక నిర్ణయానికి రావడం కాస్త తొందరపాటేనని చెప్పాలి. కంప్లీట్ స్టోరీ, సీన్స్ వెనుక ఉన్న కారణాలు తెలిస్తేనే వాటిపై క్లారిటీ వస్తుంది.

అయితే ప్రభాస్‌ తో సినిమా చేస్తున్నప్పుడు అంచనాలు ఎక్కువగా ఉండటం సహజం. అలాంటి సమయంలో కేవలం భారీ సీన్స్, యాక్షన్‌ తోనే ప్రేక్షకులను మెప్పించడం కష్టం. కథలో స్త్రెంత్, రోల్స్ లో డెప్త్, మనసుకు హత్తుకునే సీన్స్ కూడా అవసరం. సీతారామం మూవీతో హను తన స్టామినా ఏంటో ఇప్పటికే చూపించారు. ఇప్పుడు ఫౌజీతో ఆయన మరోసారి ప్రేక్షకులను ఎమోషనల్ వరల్డ్ లోకి తీసుకెళ్తారా.. సీతారామం మ్యాజిక్ మళ్లీ రిపీట్ చేస్తారా లేదా అన్నదే చూడాలి.

Tags:    

Similar News