విజయ్ సేతుపతి మళ్లీ మ్యాజిక్ చేస్తాడా?
తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.;
తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళంతో పాటు తెలుగు,మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో తనకు అభిమానులున్నారు. తెలుగులో `పిజ్జా` డబ్బింగ్‌తో ప్రేక్షకులని పలకరించినా `ఉప్పెన`తో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి తన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్‌ని దక్కించుకుని ప్రేక్షకుల్లో ప్రత్యేక అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. చిరుతో కలిసి `సైరా`లోనూ మెరిసిన సేతుపతి ఇక్కడ కూడా బాగానే పాపులర్ అయ్యాడు.
ఆ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని విజయ్ సేతుపతి తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. డబ్బింగ్ సినిమాలతోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేసిన విజయ్ సేతుపతి గత ఏడాది నటించిన `మహారాజా`తో తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి విజయ్ సేతుపతి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా నిలిచి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.
కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద రూ.190 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురి చేసింది. గత ఏడాది నవంబర్ 29న చైనాలో కూడా విడుదలైన ఈ సినిమా అక్కడ రికార్డుల్ని తిరగరాసింది. ఇండియన్ సినిమాల్లో అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా నిలిచింది. `మహారాజా` చైనాలో రూ.91.55 కోట్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇలాంటి సంచలన చిత్రానికి త్వరలో సీక్వెల్‌ని తెరకెక్కించబోతున్నారు.
ఈ సినిమాకు లభించిన క్రేజ్ కారణంగా దర్శకుడు నిథిలన్ కు బిగ్ స్టార్స్ నుంచి క్రేజీ ఆఫర్లు లభించాయి. అయినా వాటిని అంగీకరించని తను మళ్లీ విజయ్ సేతుపతితో `మహారాజా` సీక్వెల్‌కే టైమ్ కేటాయించాలనుకుంటున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. తను ఎప్పుడు రెడీ అంటే అప్పుడు డేట్స్ ఇచ్చేస్తానని విజయ్ సేతుపతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. త్వరలోనే అధికారికంగా సీక్వెల్‌పై ప్రకటన రానుందని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం విజయ్ సేతుపతి వెర్సటైల్ డైరెక్టర్ పూరీతో భారీ సినిమాకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. దీని తరువాతే `మహారాజా` సీక్వెల్ పట్టాలెక్కే అవకాశం ఉందని తెలిసింది. అయితే ఫస్ట్ పార్ట్‌ని మించి విజయ్, నిథిలన్ మ్యాజిక్ చేస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.