చాక్లెట్ బాయ్.. భూవివాదంలో ఇరుక్కున్నాడు

Update: 2015-08-30 09:03 GMT
తెరమీద చాలా సున్నితంగా ఉండే పాత్రలు వేసే మాధవన్.. కోడైకెనాల్ రైతుల రైతుల పాలిట పెద్ద విలన్ అయ్యాడు. తమ భూముల్ని కాజేయడానికి అక్రమ మార్గాల్లో ప్రయత్నిస్తున్నాడంటూ అతడిపై ఆ ప్రాంత రైతులు భగ్గుమంటున్నారు. మాధవన్ పై దిండిగల్ కలెక్టర్ కు ఫిర్యాదు కూడా చేశారు. మాధవన్ వ్యవహారంపై సీరియస్ అయిన కలెక్టర్ ఈ వివాదంపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారుల్ని ఆదేశించాడు. ఇంతకీ ఈ వివాదం తాలూకు వివరాలేంటో చూద్దాం పదండి.

కోలీవుడ్ కు చెందిన చాలామంది నటీనటులు కోడైకెనాల్ ప్రాంతంలో ఈ మధ్య జోరుగా భూములు కొంటున్నారు. భవిష్యత్తులో మంచి రేటు పలికే అవకాశముండటంతో మాధవన్ కూడా ఇక్కడో ఏడు ఎకరాలు కొని పడేశాడు. ఐతే కొన్నవాడు ఊరికే ఉండకుండా కోడైకెనాల్ వాటర్ ఫాల్స్ నుంచి తాగు, సాగునీటి అవసరాలు తీర్చుకునే రైతులకు అడ్డు పడ్డాడన్నది అతడిపై ఉన్న ఆరోపణ. వాటర్ ఫాల్స్ నుంచి రైతుల భూములకు వెళ్లే కాలువను ఆక్రమించి అతను ఫెన్సింగ్ వేసేశాడని అంటున్నారు.

మాధవన్ భూమిని ఆనుకుని రైతులకు చెందిన దాదాపు 50 ఎకరాల భూములున్నాయి. మంచి నీటి సౌకర్యం ఉన్న భూములు కావడంతో వాటన్నింటటినీ సొంతం చేసుకోవడానికి స్థానిక అధికారులత కలిసి మాధవన్ కుట్ర చేస్తున్నాడని రైతులంటున్నారు. మార్కెట్ ధర కంటే ఎక్కువ రేటిస్తాను, ఆ భూముల్ని తనకు అమ్మేయాలని అధికారుల ద్వారా ఒత్తిడి తెస్తున్నాడని రైతులు ఆరోపిస్తూ కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. అధికారులు తమ విచారణలో మాధవన్ పాత్ర గురించి ఏం తేలుస్తారో చూడాలి.
Tags:    

Similar News