ఆద‌ర్శ కుటుంబంలో అదే మెయిన్ హైలైట్

టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు మళ్లీ బలమైన ఊపు తీసుకురాబోతున్న ప్రాజెక్ట్‌గా వెంక‌టేష్ ద‌గ్గుబాటి- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెరకెక్కుతున్న ఆదర్శకుటుంబం ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది.;

Update: 2026-03-29 10:30 GMT

టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు మళ్లీ బలమైన ఊపు తీసుకురాబోతున్న ప్రాజెక్ట్‌గా వెంక‌టేష్ ద‌గ్గుబాటి- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెరకెక్కుతున్న ఆదర్శకుటుంబం ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా వెంకీ టైమింగ్, త్రివిక్రమ్ పంచ్ ల‌కు నవ్వుల పండుగ ఖాయ‌మ‌నే ఫార్ములాతో ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించబోతుందనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.

ప్రీక్లైమాక్స్ లో స్పెషల్ కామెడీ ఎపిసోడ్

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. సినిమాలో ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే స్పెషల్ కామెడీ ఎపిసోడ్ ఈ ప్రాజెక్ట్‌కు కీలక హైలైట్‌గా నిలవనుందని సమాచారం. వెంకటేశ్‌కు ఉన్న సహజమైన కామెడీ టైమింగ్‌కు, త్రివిక్రమ్‌కు ప్రత్యేకమైన పంచ్ డైలాగ్స్ కలిస్తే వచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా ఉంటుందో ఇప్పటికే ప్రేక్షకులు పలుమార్లు చూసారు. ఈసారి ఆ మ్యాజిక్‌ను మరింత పెద్ద స్థాయిలో రిపీట్ చేయాలనే ప్లాన్ కనిపిస్తోంది. ఈ కాంబినేషన్‌పై క్రేజ్‌కు మరో ప్రధాన కారణం గతంలో వీరి కల‌యిక‌లో వచ్చిన క్లాసిక్ సినిమాలు నువ్వు నాకు న‌చ్చావు, మ‌ల్లీశ్వ‌రి సినిమాలు. ఈ సినిమాల్లో త్రివిక్రమ్ రైటింగ్, వెంకీ నటన కలిసి సృష్టించిన నాస్టాల్జియా ఇప్పటికీ ప్రేక్షకుల్లో తాజాగా ఉంది. ఇప్పుడు అదే జోడీ మళ్లీ కలిసి రావడం సహజంగానే ఎగ్జైట్మెంట్ ను రెట్టింపు చేస్తోంది.

త్రివిక్ర‌మ్ రైటింగ్ పై భారీ అంచ‌నాలు

త్రివిక్రమ్ మార్క్ రైటింగ్ ఈ సినిమాకు ప్రధాన బలం అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం కామెడీ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన పదునైన డైలాగ్స్, సింపుల్ సన్నివేశాల్లోనే హ్యూమర్‌ను తీసుకురావడంలో ఆయనకు ఉన్న నైపుణ్యం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా వెంకటేశ్ పాత్రను ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరగా ఉండేలా, హ్యూమర్‌తో పాటు ఎమోష‌న్స్ ను మేళవించి డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

స‌మ్మ‌ర్ లో రిలీజ్

నిర్మాణ సంస్థ హారికా హాసినీ క్రియేష‌న్స్ కూడా ఈ సినిమా క్వాలిటీ విష‌యంలో ఎక్కడా రాజీ పడకుండా రూపొందిస్తున్నార‌ని, టెక్నికల్‌గా రిచ్‌గా, విజువల్‌గా ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక సమ్మర్ రిలీజ్ స్ట్రాటజీ కూడా ఆసక్తికరంగా మారింది. స‌మ్మ‌ర్ లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు ఎక్కువగా వచ్చే సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేయడం బాక్సాఫీస్ దృష్ట్యా కీలక నిర్ణయం. రీసెంట్ టైమ్స్ లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, ఈ సినిమా అదే ట్రెండ్‌ను క్యాష్ చేసుకునే అవకాశముంది.

సోషల్ మీడియాలో కూడా ఈ ప్రాజెక్ట్‌పై బజ్ రోజురోజుకీ పెరుగుతోంది. వెంకీ ఫ్యాన్స్ ఈ సినిమాలో పాత స్టైల్ కామెడీని మళ్లీ చూడాలని ఆశిస్తున్నారు. త్రివిక్రమ్ ఫ్యాన్స్ మాత్రం ఆయ‌న పంచ్ డైలాగ్స్, ఎమోషనల్ కంటెంట్‌పై ఎక్కువగా అంచనాలు పెంచుకున్నారు. మొత్తం మీద చూస్తే, కంటెంట్ బలంగా ఉండటం, వెంకీ- త్రివిక్ర‌మ్ హిట్ కాంబినేషన్, సమ్మర్ రిలీజ్.. ఇవ‌న్నీ కలిసి ఆదర్శకుటుంబంను సక్సెస్ ట్రాక్‌లో నిలబెట్టే అవకాశాలు ఎక్కువ‌గా కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News