డిసెంబ‌ర్లో అక్క‌డ ముగింపు..ఇక్క‌డ ఆరంభం!

విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-11-22 08:30 GMT

విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. కానీ ఇంత వ‌ర‌కూ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కాలేదు. గురూజీ సిద్దంగా ఉన్నా వెంక‌టేష్ మాత్రం బిజీగా ఉండ‌టంతో వీలు ప‌డ‌లేదు. చిరంజీవి హీరోగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు` లో కూడా వెంకీ కీల‌క పాత్ర పోషించ‌డంతో? గురూజీ వెయిట్ చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. నెల రోజులుగా వెంకీ ఆ సినిమా ప‌నుల్లోనే బిజీగా ఉన్నాడు. చిరు-వెంకీ మ‌ధ్య కాంబినేష‌న్ స‌న్నివేశాల‌తో పాటు ఇద్ద‌రు క‌లిసి ఓ పాట‌కు కూడా చేయ‌బోతున్నారు. దీంతో వెంకీ పాత్ర ప్రాధాన్య‌త అర్ద‌మ‌వుతుంది.

సంక్రాంతికి సెల‌వుల్లోనే:

తాజాగా వెంకీ రోల్ ముగింపు ద‌శ‌కు చేరుకున్న్టు తెలిసింది. డిసెంబ‌ర్ తొలి వారానిక‌ల్లా వెంకీపై షూటింగ్ మొత్తం పూర్తి చేయ‌నున్నారు. అనంత‌రం రెండ‌వ వారం నుంచి త్రివిక్ర‌మ్ సినిమా షూటింగ్ లో వెంకీ జాయిన్ అవుతారు. చిత్రీక‌ర‌ణ మొద‌లైన నాటి నుంచి తొలి షెడ్యూల్ డిసెంబ‌ర్ అంతా జ‌రుగుతుంద‌ని స‌మాచారం. అనంత‌రం గురూజీ టీమ్ సంక్రాంతి సెల‌వులు ప్ర‌క‌టించ‌నుంది. అంటే డిసెంబ‌ర్ నుంచి సంక్రాంతి మూడు రోజుల పండుగ పూర్త‌య్యే వ‌ర‌కూ కొత్త షెడ్యూల్ మొద‌ల‌వ్వ‌దు. ఈ సినిమా విష‌యంలో వెంకీ-త్రివిక్ర‌మ్ నుంచి కొత్త అంశాలేమి ఉండ‌వు.

60 ఏళ్ల న‌టుడితో 30 ఏళ్ల న‌టి:

ఇద్ద‌రికి క‌లిసొచ్చిన పాయింట్ తోనే సినిమా చేస్తున్నారు. విదోనం, భావోద్వేగం ఆధారంగా సాగే కుటుంబ కథా చిత్రంగా తెలుస్తోంది. వెంకటేష్ మార్క్ కామెడీ టైమింగ్..గురూజీ మార్క్ పంచ్ ల‌తో ఆద్యంతం వినోద భ‌రితంగా క‌థ సాగనుంది. గ‌తంలో ఇద్ద‌రు క‌లిసి సినిమాలు చేయ‌క‌పోయినా? వెంకేట‌ష్ హీరోగా న‌టించిన సినిమాల‌కు గురూజీ రైట‌ర్ గా ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో వెంక‌టేష్ కు జోడీగా క‌న్న‌డ న‌టి శ్రీనిది శెట్టి ఎంపికైంది. వెంకీ-శ్రీనిధి మ‌ధ్య వ‌య‌సు వ్య‌త‌సం భారీగా ఉన్నా? ఈ కాంబినేష‌న్ విష‌యంలో పెద్ద‌గా నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వ‌లేదు.

వెంకీ వ‌య‌సు 64 కాగా..శ్రీనిధికి శెట్టికి 33 ఏళ్లు నిండాయి. 30 ఏళ్లు దాటాయి? అంటే దాన్ని పెద్ద‌గా వ్య‌త్యాసంగా హైలైట్ అవ్వ‌దు.

300 కోట్ల వ‌సూళ్ల‌ను మించి:

మూడు ప‌దులు దాటిన న‌టి జాబితాలో శ్రీనిధి ప‌డిపోతుంది. దీంతో నెగిటివీటికి అవ‌కాశం ఉండ‌దు. ఈ విష‌యంలో గురూజీ తెవిలిగా వ్య‌వ‌హ‌రించి 30 దాటిన భామ‌ను ఎంపిక చేయ‌డం విశేషం. శ్రీనిధి ఇప్ప‌టికే `కేజీఎఫ్` తో టాలీవుడ్ ని ప‌ల‌క‌రించింది. అటుపై నాని హీరోగా న‌టించిన `హిట్ ది థ‌ర్డ్ కేస్` లోనూ భాగ‌మైంది. ఈ రెండు సినిమాలు మంచి విజ‌యం సాధించిన చిత్రాలే. థ‌ర్డ్ వెంచ‌ర్ వెంకీ సినిమా పై కూడా అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. వెంక‌టేష్

`సంక్రాంతి వ‌స్తున్నాం` తో 300 కోట్ల క్ల‌బ్ లోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. దీంతో గురూజీ విజ‌యం అంత‌కు మించి ఉండాల‌నే అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి.

Tags:    

Similar News