వెంకీ మామ మళ్లీ అదే మిస్టేక్..?

సంక్రాంతికి హిట్ తో వెంకీ మామ తన ఆలోచన మార్చుకున్నాడని తెలుస్తుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మాత్రమే చేయాలని ఫిక్స్ అయ్యారట.;

Update: 2025-04-12 22:30 GMT

విక్టరీ వెంకటేష్ రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించింది. అందుకే ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ తో దుమ్ము దులిపేసింది. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ విక్టరీ వెంకటేష్ లో కూడా ఫుల్ జోష్ తెచ్చింది. లాస్ట్ ఇయర్ పొంగల్ కి సైంధవ్ తో డిజప్పాయింట్ అయిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం తో సక్సెస్ అందుకోవడంతో తను ఎలాంటి సినిమాలు తీస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటాడో అన్న క్లారిటీ వచ్చింది.

ఐతే వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం తీసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా లాక్ చేసుకున్నాడు. ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. 2026 సంక్రాంతికి మెగాస్టార్ సినిమాతో రాబోతున్నాడు అనిల్ రావిపూడి. ఐతే వెంకటేష్ మాత్రం నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ని లాక్ చేయలేదు. ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తున్నా వాటిలో ఏది ఫైనల్ అవ్వలేదని తెలుస్తుంది.

సంక్రాంతికి హిట్ తో వెంకీ మామ తన ఆలోచన మార్చుకున్నాడని తెలుస్తుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మాత్రమే చేయాలని ఫిక్స్ అయ్యారట. అందుకు తగినట్టుగానే ఆ తరహా కథలనే వింటున్నారని తెలుస్తుంది. ఐతే ఇప్పటికే కొన్ని కథలు విని ఓకే చెప్పినా వాటిలో ఏది ఫైనల్ చేయలేదని టాక్. అంతేకాదు డైరెక్టర్స్ విషయంలో కూడా వెంకీ మామ కాస్త కన్ ఫ్యూజన్ గా ఉన్నాడని తెలుస్తుంది.

ఒకరిద్దరు దర్శకులు కథతో ఇంప్రెస్ చేశారని తెలుస్తుంది. వాళ్ల మీద వెంకీ మామ పూర్తి నమ్మకం కుదిరినట్టు తెలుస్తుంది. అయినా కూడా ఎక్కడో ఒక చిన్న డౌట్ తో వెయిట్ చేస్తున్నారని టాక్. ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కొట్టాక కూడా వెంకటేష్ ఇంకా టైం తీసుకోవడం పట్ల ఆయన ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు. ఇక మరోపక్క వెంకటేష్, రానా కలిసి చేస్తున్న రానా నాయుడు 2 ని పూర్తి చేసే పనుల్లో కూడా వెంకటేష్ బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ సీరీస్ పూర్తి చేశాక వెంకటేష్ నెక్స్ట్ సినిమా విషయంలో దూకుడు పెంచే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మరి వెంకటేష్ తో ఈసారి ఏ డైరెక్టర్ మూవీ ఉంటుంది అన్నది చూడాలి.

Tags:    

Similar News