తమ్ముడు కోసం క్యూటీ బ్యూటీ

ఇప్పుడు క్యూటీ బ్యూటీ అయిన వర్ష బొల్లమ్మ ఈ సినిమాలో నితిన్ కు జోడీగా నటించనుందనే వార్తలు వస్తున్నాయి.

Update: 2024-04-28 06:00 GMT

నితిన్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్ మూవీ 'తమ్ముడు'. పవన్ కళ్యాణ్ సూపర్‌ హిట్‌ మూవీ టైటిల్‌ అవ్వడంతో పాటు, పవన్ కి వీరాభిమాని అయిన నితిన్‌ మూవీకి తమ్ముడు టైటిల్‌ ను పెట్టడంతో అందరి దృష్టిని ఆకర్షించారు.

తమ్ముడు అనేది చాలా క్యాచీ టైటిల్‌. కనుక టైటిల్‌ తోనే పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలో నితిన్ కు జోడీగా సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తుందనే వార్తలు మొదట వచ్చాయి. ఇప్పుడు క్యూటీ బ్యూటీ అయిన వర్ష బొల్లమ్మ ఈ సినిమాలో నితిన్ కు జోడీగా నటించనుందనే వార్తలు వస్తున్నాయి.

సప్తమి గౌడ తో పాటు వర్ష బొల్లమ్మ ఈ సినిమాలో నితిన్ కు జోడీగా నటించబోతుందా లేదంటే వర్ష మాత్రమే ఈ సినిమాలో నటించనుందా అనే విషయాలు తెలియాలి అంటే యూనిట్‌ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్‌ లయ ముఖ్య పాత్రలో నటించడం విశేషం.

నితిన్ కు అక్కగా లయ నటిస్తున్న నేపథ్యంలో, సినిమాకు టైటిల్ గా తమ్ముడు అని కన్ఫర్మ్‌ చేసిన కారణంగా ఇది ఖచ్చితంగా అక్క తమ్ముడి సెంటిమెంట్‌ సినిమా అయ్యి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మొత్తానికి ఈ తమ్ముడు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూసేలా బజ్ క్రియేట్‌ అయ్యింది.

Read more!

ఈ సినిమా ను భారీ బడ్జెట్‌ తో దర్శకుడు వేణు శ్రీరామ్‌ రూపొందిస్తున్నాడు. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. దిల్‌ రాజు కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. నితిన్ కు తగ్గ కథ అని డిసైడ్‌ అయిన తర్వాతే ఈ సినిమా నిర్మాణం మొదలు పెట్టారట.

ఇక హీరోయిన్ వర్ష బొల్లమ్మ తెలుగు లో ఈ మధ్య కాలంలో వరుస సినిమాలు చేస్తుంది. ఇటీవలే సందీప్‌ కిషన్‌ తో కలిసి ఊరు పేరు భైరవ కోన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాతో పాటు అంతకు ముందు వచ్చిన సినిమాలతో ఈ అమ్మడు క్యూట్‌ బ్యూటీ అనిపించుకుంది. అందుకే ఇప్పుడు తమ్ముడు కు జోడీగా నటించబోతుంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అంచనాలు పెరుగుతున్నాయి.

Tags:    

Similar News