దేశాల లిస్ట్ వ‌చ్చే దెప్పుడు?

ఎస్ ఎస్ ఎంబీ 29' వార‌ణాసి' పాన్ వ‌ర‌ల్డ్ లో రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఏకంగా 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.;

Update: 2025-11-28 20:30 GMT

ఎస్ ఎస్ ఎంబీ 29' వార‌ణాసి' పాన్ వ‌ర‌ల్డ్ లో రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఏకంగా 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. 100 కోట్ల‌కు మందికి పైగా ఈ చిత్రం చేరాలి? అన్న‌ది రాజ‌మౌళి ప్లాన్. దీనిలో భాగంగా వీలైన‌న్ని దేశాల్లో...వీలైన‌న్ని భాష‌ల్లో రిలీజ్ చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. అందుకు క‌ట్టుబ‌డి టీమ్ అంతా ప‌ని చేస్తోంది. తూర్పు ఆఫ్రికా అంత‌టా ప‌ర్య‌టించిన అనంత‌రం 120 మందితో కూడిన రాజమౌళి టీమ్ చివ‌రిగా కెన్యాను లొకేష‌న్ గా ఎంచుకోవ‌డంతోనే రిలీజ్ సంగ‌తి బ‌య‌ట ప‌డింది. ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాదిని ని రాజ‌మౌళి అండ్ కో మ‌ర్యాద పూర్వ‌కంగానూ క‌లిసింది.

రిలీజ్ ఆషామాషీ కాదు:

ఈ భేటి అనంత‌రం 120 దేశాల్లో రిలీజ్ అన్న సంగ‌తి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా 195పైగా దేశాలున్నాయి. మ‌రి వీటిలో రాజ‌మౌళి రిలీజ్ కోసం ఎంపిక చేసుకున్న 120 దేశాలు ఏంటి? అన్న‌దే ఇక్క‌డ ఆస‌క్తిక‌రం. వీటిలో ఎన్ని దేశాల్లో సినిమాల‌కు ఆద‌ర‌ణ ద‌క్కుతుంది? ఎన్ని దేశాల్లో థియేట‌ర్లు ఉన్నాయి? ఎన్ని భాష‌ల్లో రిలీజ్ కు అవ‌కాశం ఉంటుంది? ఎన్ని భాష‌ల్లో ప్ర‌చారం చేయాల్సి ఉంటుంది? ఇలా ఎన్నో సందేహాలున్నాయి. కానీ 120 దేశాల్లో రిలీజ్ అన్నది చిన్న టాస్క్ కాదు.

తెలిసిన దేశాలివే:

రిలీజ్ కు సంబంధించే రాజ‌మౌళి టీమ్ నెల‌ల త‌ర‌బ‌డి ప‌ని చేయాల్సి ఉంటుంది. సాధార‌ణంగా భార‌తీయ‌ సిని మాలు ఎక్కువ‌గా అమెరికా, చైనా, జ‌పాన్, థాయ్ లాండ్, ర‌ష్యా , ద‌క్షిణా కొరియా, సౌత్ కొరియా, యూకే, పాకిస్తాన్, అర‌బ్ దేశాల్లో రిలీజ్ అవుతుంటాయి. ఈ దేశాల్లో భార‌తీయ సినిమాలు మంచి వ‌సూళ్లు రాబ‌ట్టిన సంద‌ర్భాలెన్నో. తెలుగు సినిమా అయినా? హిందీ సినిమా? త‌మిళ సినిమా అయినా ఈ దేశాల్లోనే ఎక్కువ‌గా రిలీజ్ అవుతుంటాయి. ఇవ‌న్నీ క‌లిపినా 20 దేశాల లెక్క‌కు రాదు.

రాజమౌళి డీల్ ఎవ‌రితో?

ఈ నేప‌థ్యంలో రాజ‌మౌళి మిగ‌తా చిత్రాల‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న 195 దేశాల్లో 100 దేశాలు..భాష‌లు ఏవి అవుతాయి? అన్న‌ది ఆస‌క్తిక‌ర విష‌య‌మే. రిలీజ్ కు సంబంధించి నిర్ణ‌యాలు పూర్తిగా రాజ‌మౌళినే తీసుకుంటారు. దీనికి సంబంధించి విదేశాల్లో ఉన్న వివిధ ఏజెన్సీలు..డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ‌లతోనూ రాజ‌మౌళి డీల్ కుదుర్చుకునే అవ‌కాశం ఉంది. మ‌రి రిలీజ్ కు సంబంధించి విదేశాల పూర్తి డేటా ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుందో చూడాలి.

అమెరికా, కొరియా, చైనా నుంచి ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌య్యే హాలీవుడ్ సినిమాలు బిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్ల‌ను సాధిస్తున్నాయి. కానీ ఇత‌ర దేశాలు దీనిని అందిపుచ్చుకోవ‌డంలో వెన‌క‌బ‌డి ఉన్నాయి. భార‌త‌దేశం కూడా వినోద రంగం ఇంకా ఆ స్థాయిని అందుకోలేదు. కొరియా దేశాల్లోనూ సినిమా ఔత్సాహికుల వ‌ద్ద‌కు భార‌తీయ సినిమాను చేర్చాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌.

Tags:    

Similar News