యువి వారి హెచ్చరిక.. అలాంటివి నమ్మొద్దంటూ..!

తాము చేయాలనుకున్న సినిమాల గురించి ఆడిషన్ కాల్ ఏమైనా సరే అఫీషియల్ ఛానెల్స్ లో వస్తాయి.;

Update: 2025-07-03 17:14 GMT

ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ వారు తమ పేరు మీద లేదా తమతో భాగస్వామ్యం అంటూ ఎవరైనా కాస్టింగ్ ఆడిషన్ కానీ వేరే వ్యవహారాలు చేస్తే అలాంటి వాటికి తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తమ పేరుని వాడుకుంటూ కొందరు ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని వారు వెల్లడించారు. ఒక హీరోయిన్ ను తాము తీసే సినిమా కోసం అప్రోచ్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. ఐతే అలాంటి వాటిల్లో ఎలాంటి వాస్తవం లేదు.

 

తాము చేయాలనుకున్న సినిమాల గురించి ఆడిషన్ కాల్ ఏమైనా సరే అఫీషియల్ ఛానెల్స్ లో వస్తాయి. దానికి సంబంధించిన విషయాన్ని యువి క్రియేషన్స్ అధికారికంగా ప్రకటిస్తుంది. అలా కాకుండా మా ప్రమేయం లేకుండా ఎవరైనా మా సంస్థ పేరుని వాడుకుని కాస్టింగ్ ఆడిషన్ చేస్తే వాటిని నమ్మకండి.

మా సంస్థ వాడుకుంటున్న వారిని ఖండించాల్సిన అవసరం ఉంది. యువి క్రియేషన్స్ నిర్మించే ఏ సినిమాకైనా ఆడిషన్స్ లేదా మిగతా విషయాల పట్ల అఫీషియల్ గానే అనౌన్స్ చేస్తుంది. ఈ విషయంలో ఎలాంటి మధ్యవర్తిత్వాలు ఉండవు. యువి క్రియేషన్స్ పేరు చెప్పి ఇలా ఆఫర్స్ ఎర వేస్తున్న వారిని హెచ్చరిస్తూ ఒక ప్రెస్ నోట్ వదిలారు యువి నిర్మాతలు. యువి క్రియేషన్స్ వారు ప్రేక్షకులతో పాటుగా ఆ బ్యానర్ నుంచి వస్తున్న ఈ కాస్టింగ్ కాల్స్ గురించి జరుగుతున్న మోసాన్ని బట్టబయలు చేశారు.

యువి క్రియేషన్స్ వారు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఘాటి కూడా ఇదే బ్యానర్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలతో యువి క్రియేషన్స్ తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు. విశ్వంభర సినిమా కచ్చితంగా ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ ఇవ్వడం గ్యారెంటీ అనేస్తున్నారు.

ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ యువి క్రియేషన్స్ బ్రాండ్ వాల్యూ చూపించిన వారు. ఈమధ్య కాస్త వెనకపడ్డారు. ఐతే యువి క్రియేషన్స్ బ్యానర్ పేరుని వాడుతూ కొందరు చేస్తున్న విషయాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఆ బ్యానర్ నుంచి అఫీషియల్ గా ఈ ప్రకటన వచ్చింది.

Tags:    

Similar News