ఎనర్జిటిక్ స్టార్ కోసం ఉపేంద్రని దించేస్తున్నారా?
మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీపై రామ్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగతోంది.;
ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్న ఎనర్జిటిక్ హీరో రామ్ ఆ తరువాత నుంచి హిట్టు మాట విని ఏళ్లు గడుస్తున్నాయి. గత నాలుగేళ్లుగా వరుస ఫ్లాపుల్ని ఎదుర్కొంటూ కెరీర్ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రామ్ ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుతం `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` ఫేమ్ మహేష్ బాబు డైరెక్షన్‌లో రామ్ ఓ మూవీ చేస్తున్నాడు. సాగర్ అనే క్యారెక్టర్‌లో రామ్ నటిస్తున్న ఈ మూవీలో రాజశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీపై రామ్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగతోంది. గత చిత్రాలకు పూర్తి భిన్నమైన మేకోవర్‌తో, భిన్నమైన క్యారెక్టరైజేషన్‌తో రామ్ నటిస్తున్నాడు. వరుస ఫ్లాపులతో బెంబేలెత్తిపోయిన రామ్ ఎలాగైనా ఈ సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి రావాలనుకుంటున్నాడు. ఆ కారణంగానే చాలా జాగ్రత్తగా ఈ మూవీని ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి `ఆంధ్రా కింగ్ తాలూకా` అనే టైటిల్‌ని మేకర్స్ అనుకుంటున్నట్టుగా ఇన్ సైడ్‌టాక్.
మే 15న రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టీజర్‌తో పాటు సినిమా టైటిల్‌ని కూడా రివీల్ చేయబోతున్నారట. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఇందులో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ హీరోని అనుకుంటున్నారట. ముందు ఈ క్యారెక్టర్ కోసం మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ని అనుకున్నారని, ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరిగింది. కానీ ఆ తరువాత ఆ స్థానంలో ఇప్పుడు ఉపేంద్రని ఫైనల్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మధ్య ఉపేంద్ర సోలో హీరోగా కంటే అతిథి పాత్రలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టున్నారు. ఇటీవల వరుణ్‌తేజ్ `గని`లోని కీలక పాత్రలో కనిపించారు. త్వరలో రజనీ హీరోగా విడుదలకు రెడీ అవుతున్న `కూలీ`లోనూ ఉపేంద్ర ఓ కీలక పాత్రలో నటించడం తెలిసిందే. దీనితో పాటు శివరాజ్‌కుమార్‌తో కలిసి `45 అనే మూవీలోనూ ఊనటించడం తెలిసిందే. ఇప్పుడు రామ్‌తో కలిసి నటించనున్నారని వార్తలు వస్తుండటంతో ఈ మూవీకి ఉపేంద్ర మరింత ప్లస్ అవుతారని రామ్ ఫ్యాన్స్ భావిస్తున్నారట.
సినిమాలో కథ ప్రకారం ఉపేంద్ర కోసం అనుకుంటున్న క్యారెక్టర్ సినిమా హీరో అని తెలిసింది. మరి సినిమా హీరోకు, సాగర్‌గా నటిస్తున్న రామ్‌కు ఉన్న సంబంధం ఏంటీ? అనేది ఇందులో ఆసక్తికరం. అన్నీ కరెక్ట్‌గా కుదిరి ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ప్రాజెక్ట్ వార్తల్లో నిలవడం ఖాయం.