ఒకవైపు విజయ్ ఎన్నికల ఫలితాలు.. మరొకవైపు త్రిష బర్తడే.. షాకింగ్ పోస్ట్ వైరల్!

దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం ఇటు సినిమా ఇండస్ట్రీలో, అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.;

Update: 2026-04-30 07:58 GMT

దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం ఇటు సినిమా ఇండస్ట్రీలో, అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక వింత పోస్ట్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే మే 4వ తేదీనే ఆమె పుట్టినరోజు కూడా ఉండటంతో, దళపతి విజయ్ విజయం కోసం ఆమె ఎదురుచూస్తున్నారా? అందుకే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఆ విశేషాలు చూద్దాం..




 


నిద్రపై త్రిష లెక్కలు.. అసలు మ్యాటర్ ఏంటి?:

త్రిష తన సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన కోట్ షేర్ చేశారు. "మనం ఒక గంట నిద్ర కోల్పోతే, దాని నుండి కోలుకోవడానికి నాలుగు రోజులు పడుతుంది. నా లెక్కల ప్రకారం చూస్తే, నేను మళ్ళీ మామూలు స్థితికి రావడానికి 2062 సంవత్సరం పడుతుంది" అని ఆమె పేర్కొన్నారు. అంటే ఆమె ఎంతగా నిద్రను కోల్పోయారో అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కల ప్రకారం చూస్తే దాదాపు గత నాలుగు నెలల నుండి ఆమె సరిగ్గా నిద్రపోవడం లేదని నెటిజన్లు లెక్కలు కడుతున్నారు.

రాజకీయ టెన్షనా.. లేక సినిమా బిజీనా?:

తమిళనాడులో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొంది. దళపతి విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రికళగం' పార్టీ భవితవ్యం మే 4న తేలనుంది. విజయ్‌కి అత్యంత సన్నిహితురాలు కావడంతో త్రిష ఆయన విజయం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని టాక్. ఇక అందుకే ఈ టెన్షన్‌లో ఆమెకు నిద్ర పట్టడం లేదని కొందరు అంటుంటే, వరుస సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్లే ఇలా జరుగుతోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

మే 4న డబుల్ సెలబ్రేషన్స్ ఉండేనా?:

ఇక మే 4వ తేదీ త్రిష 43వ పుట్టినరోజు. అదే రోజు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఒకవేళ విజయ్ రాజకీయాల్లో ఆశించిన విజయం సాధిస్తే, త్రిషకు అది డబుల్ సెలబ్రేషన్ అవుతుంది ఆయన ఫాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇక తన స్నేహితుడి గెలుపును, తన బర్త్ డేను ఒకే రోజు జరుపుకునే అవకాశం ఉంది. అందుకే ఈ మే 4వ తేదీ ఆమె జీవితంలో చాలా కీలకంగా మారబోతోంది.

సినిమాల్లో ఫుల్ జోరు:

రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం సాగినా, త్రిష మాత్రం సినిమాలపైనే దృష్టి పెట్టారు. సూర్య సరసన నటించిన 'కరుప్పు' (తెలుగులో వీరభద్రుడు) మే 14న విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర', మలయాళంలో 'రామ్' వంటి భారీ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. ఇక ఇంత బిజీ షెడ్యూల్ వల్ల కూడా ఆమెకు విశ్రాంతి దొరకడం లేదని తెలుస్తోంది. అందుకే ఆ నిద్రలేమిపై ఆమె అలా సెటైరికల్‌గా పోస్ట్ పెట్టారు.

నెటిజన్ల ఆందోళన.. త్రిష ఏమంటారంటే?:

త్రిష పోస్ట్ చూసిన అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. "మేడం.. అంతగా ఆలోచించకండి, ఆరోగ్యం జాగ్రత్త" అని కొందరు కామెంట్ చేస్తుంటే, "విజయ్ గెలుపు కోసమే కదా ఈ వెయిటింగ్" అని మరికొందరు ఆటపట్టిస్తున్నారు. ఇక ఆమెకు ఏమైనా మానసిక ఒత్తిడి ఉందా అని ఆందోళన చెందుతున్న వారికి, ఇది కేవలం సరదాగా పెట్టిన పోస్ట్ మాత్రమేనని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

మొత్తానికి త్రిష పెట్టిన ఈ 'స్లీప్ రికవరీ' పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మే 4వ తేదీన ఆమె పుట్టినరోజు వేడుకలు ఎలా సాగుతాయో, విజయ్ పార్టీ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి. అప్పటిదాకా త్రిష నిద్రలేని రాత్రులు గడపాల్సిందేనని ఆమె ఫ్యాన్స్ సరదాగా అనుకుంటున్నారు.

Tags:    

Similar News