ఒకే ఈవెంట్.. ఒకే ఫ్రేమ్.. మరి స్పిరిట్ కనెక్షన్ ఎక్కడిది?
ఒకే ఈవెంట్ కు వెళ్లారు.. ఒకే ఫ్రేమ్ లో కనిపించారు.. అంతే. కానీ సోషల్ మీడియాలో మాత్రం వెంటనే ప్రభాస్ స్పిరిట్ తో కనెక్షన్ మొదలైపోయింది
ఒకే ఈవెంట్ కు వెళ్లారు.. ఒకే ఫ్రేమ్ లో కనిపించారు.. అంతే. కానీ సోషల్ మీడియాలో మాత్రం వెంటనే ప్రభాస్ స్పిరిట్ తో కనెక్షన్ మొదలైపోయింది. బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి, ప్రముఖ యూట్యూబర్ ఐషో స్పీడ్ ఒకే చోట కనిపించినంత మాత్రాన స్పిరిట్ కు లింక్ ఎలా వచ్చేసింది? ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే..
రీసెంట్ గా అమెరికాలో జరిగిన యాపిల్ ఐఫోన్ లాంచ్ ఈవెంట్ కు తృప్తి దిమ్రి అటెండ్ అయ్యారు. ఆమెతో పాటు సింగర్ ఏపీ ధిల్లాన్ ఈవెంట్ లో కనిపించారు. యాపిల్ సీఈఓ జాన్ టెర్నస్ కొత్త ఐఫోన్ 18 ప్రో మోడళ్లను వారికి చూపించారు. ఆ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో ఐషో స్పీడ్ అక్కడి నుంచి లైవ్ స్ట్రీమింగ్ చేశారు. తృప్తి ఆయన లైవ్ లో కనిపించడంతో ఫ్యాన్స్ దృష్టి ఒక్కసారిగా స్పిరిట్ వైపు వెళ్లింది.
ఎందుకంటే తృప్తి దిమ్రి ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. దీంతో ఐషో స్పీడ్ తో ఆమెకు సంబంధించిన ఆ వీడియో బయటకు రావడంతో.. స్పిరిట్ లో అతడు కనిపించబోతున్నాడా? అనే చర్చ మొదలైంది. కానీ ఇక్కడే అసలు లాజిక్ మిస్ అవుతోంది. యాపిల్ ఈవెంట్‌కు చాలామంది ప్రముఖులు వచ్చారు. అందులో తృప్తి ఉన్నారు. ఐషో స్పీడ్ కూడా ఉన్నారు.
మరి ఒకే ఈవెంట్‌లో కనిపించిన ప్రతి ఒక్కరికీ సినిమా కనెక్షన్ ఉందని చెప్పగలమా? కచ్చితంగా చెప్పలేం. ఇప్పటివరకు ఐషో స్పీడ్ స్పిరిట్ లో నటిస్తున్నాడని అధికార ప్రకటన రాలేదు. అందుకే తృప్తి అతడి లైవ్ లో కనిపించిన వీడియోను సినిమా క్యాస్టింగ్ కు లింక్ చేయడం కరెక్ట్ కాదు. అది కేవలం ఒక వైరల్ మూమెంట్ కావచ్చు.
ఇక స్పిరిట్ విషయానికి వస్తే.. సినిమా చుట్టూ ఇప్పటికే ఎన్నో రూమర్లు వచ్చాయి. అనేక మంది సెలబ్రిటీలు సినిమాలో ఉన్నారంటూ గతంలో ప్రచారం జరిగినా, వాటిలో కొన్నింటిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల చిరంజీవి, కొరియన్ నటుడు డాన్ లీ, ప్రకాశ్ రాజ్ స్పిరిట్ లో లేరని మేకర్స్ స్పష్టం చేశారు. దీంతో సినిమా విషయంలో వైరల్ అవుతున్న ప్రతి వార్తను వెంటనే నిజమని నమ్మడం కరెక్ట్ కాదనే విషయం కూడా స్పష్టమవుతోంది.
అయితే ఆ వైరల్ వీడియోకు ఒక స్పెషాలిటీ మాత్రం ఉంది. స్పిరిట్ బజ్ మేకర్స్ పాన్-వరల్డ్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఎనిమిది భాషల్లో సినిమాను తీసుకెళ్లే ప్లాన్ ఉందని ఇప్పటికే వెల్లడించారు. పాన్ ఇండియా రేంజ్ దాటి పాన్ వరల్డ్ ను టార్గెట్ చేస్తున్న సినిమాకు ఐషో స్పీడ్ లాంటి గ్లోబల్ డిజిటల్ స్టార్ పేరు యాడ్ కావడం ఆసక్తి పెంచుతుంది. కానీ అది రూమర్ మాత్రమే.. అధికారిక సమాచారం కాదు. ఒకే ఈవెంట్.. ఒకే ఫ్రేమ్.. వైరల్ వీడియో.. అంతే. స్పిరిట్ కనెక్షన్ మాత్రం ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది!