ఆ స్టార్ హీరోను రిజెక్ట్ చేసిన ఇద్దరు దర్శకులు

అందులో ఒకరు హిందీలో ఎంట్రీ ఇచ్చి భారీ విజయం సాధించారు. ఇంకొకరెమో.. సౌత్ నుంచి వచ్చి బడా డైరెక్టర్.;

Update: 2025-09-05 02:45 GMT

తెలుగు సినిమా వర్గాల్లో ఆసక్తికరమైన గాసిప్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఆయన ఇటీవల పాన్ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ అందుకున్న తెలుగు హీరో. ప్రస్తుతం ఆయన ఒక అగ్ర దర్శకుడితో గ్లోబల్ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఆ సినిమా 2027లో విడుదల కానుంది. ఈ హీరో తన టీమ్ ద్వారా ఇద్దరు ప్రముఖ దర్శకులను సంప్రదించాడు.

అందులో ఒకరు హిందీలో ఎంట్రీ ఇచ్చి భారీ విజయం సాధించారు. ఇంకొకరెమో.. సౌత్ నుంచి వచ్చి బడా డైరెక్టర్. ప్రస్తుతం ఆయన తెలుగులో పెద్ద స్టార్లతో పని చేస్తున్నాడు. అయితే ఈ స్టార్ దర్శకులు తెలుగు సినిమా నుండి వచ్చిన ఈ అగ్ర నటుడి ప్రతిపాదనను తిరస్కరించారు. ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించలేదు. నటుడి సృజనాత్మక ప్రమేయమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంటే స్టోరీలో లేదా డైరెక్షన్ లో తన ప్రమేయం చూపిస్తాడేమోనని దర్శకులు నటుడి ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం.

దీంతో ఈ తెలుగు నటుడు బాలీవుడ్ ఇండస్ట్రీతో కొలాబరేట్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అక్కడి డైరెక్టర్ తో సినిమా చేసి సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే తనకు బాలీవుడ్ లో నటించడం ఆసక్తిగా ఉండడంతో పలువురితో చర్చలు కూడా జరుపుతున్నాడు. అయితే టాప్ డైరెక్టర్లు అతడిని రిజెక్ట్ చేయడంతో.. బీ టౌన్ వైపు వెళ్లాడు.

అతడు ప్రస్తుతం బాలీవుడ్ లో సరైన దర్శకుడి కోసం వెతుకుతున్నాడు. తన రాబోయే సినిమాను బాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో చేసి నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు. అలాగే తన ఇమేజ్ అండ్ బిజినెస్ కు సరిపోయే సరైన బాలీవుడ్ దర్శకుడి కోసం ప్రస్తుతం వెతుకుతున్నాడు. ఎంత్తైనా అగ్ర నటుడికి ఆ దర్శకులిద్దరూ నో చెప్పడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News