మెగా 158: చిరంజీవి కూతురుగా ధురంధర్ బ్యూటీ!

ఈ ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.;

Update: 2026-02-04 08:43 GMT

ఈ ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ , నయనతార కీలక పాత్రలు పోషించారు. రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో.. చిరంజీవి తదుపరి చిత్రంపై అందరి అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే 'వాల్తేరు వీరయ్య' సినిమా చేసి మంచి విజయం అందించిన డైరెక్టర్ బాబి కొల్లితో మళ్లీ జతకట్టారు చిరంజీవి. మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచీ ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇటీవలే ధురంధర్ సినిమాతో సంచలనం సృష్టించిన చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ ఇందులో చిరంజీవికి కూతురు పాత్ర చేయనున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి కూతురిగా శ్రీ లీల, అనస్వర రాజన్ వంటి వారి పేర్లు కూడా వినిపించాయి.దీనికి తోడు కృతి శెట్టి పేరు కూడా తెరపైకి రాగా.. ఇప్పుడు ఈ రేసులో సారా అర్జున్ పేరు గట్టిగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. అయితే దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సారా అర్జున్ విషయానికి వస్తే.. ఒకప్పుడు విక్రమ్ హీరోగా నటించిన నాన్న సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత పదుల సంఖ్యలో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇక దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్యరాయ్ చిన్నప్పటి పాత్ర పోషించి అందరూ దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు బాలీవుడ్ స్పై థ్రిల్లర్ ధురంధర్ సినిమాలో రణవీర్ సింగ్ సరసన నటించి మరింత క్రేజ్ సొంతం చేసుకుంది ..ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూలు రాబట్టడంతో ఈమె గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఇక మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో 'యుఫోరియా' సినిమాతో ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

చిరంజీవి - బాబీ సినిమా విషయాలకొస్తే.. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు . అలాగే ప్రముఖ సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూడా భాగమయ్యింది. అలాగే ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కూడా ఇందులో నటిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా భారీ అంచనాల మధ్య భారీ తారాగణం , అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల కలయికతో వస్తున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News