ఆ ఆఫ‌ర్ కోసం ప్రార్థించ‌మంటున్న మృణాల్

ఆడియ‌న్స్‌కే కాదు, న‌టీన‌టుల‌కు కూడా ఫ‌లానా వారితో వ‌ర్క్ చేయాలి, ఫ‌లానా కాంబినేష‌న్ లో సినిమా చేయాల‌నుంటుంది.;

Update: 2026-02-04 08:44 GMT

ఆడియ‌న్స్‌కే కాదు, న‌టీన‌టుల‌కు కూడా ఫ‌లానా వారితో వ‌ర్క్ చేయాలి, ఫ‌లానా కాంబినేష‌న్ లో సినిమా చేయాల‌నుంటుంది. ఆ కాంబినేష‌న్ లో న‌టించే ఛాన్స్ ఎప్పుడెప్పుడొస్తుందా అని వాళ్లు కూడా వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కూడా అలాంటి ఓ కాంబినేష‌న్ కోసం ఎదురు చూస్తున్నారు. టెలివిజ‌న్ న‌టిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ త‌ర్వాత హీరోయిన్ గా మారిన విష‌యం తెలిసిందే.

సీతారామంతో మంచి గుర్తింపు

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైన మృణాల్ ఆ సినిమాలో సీత‌గా న‌టించి అంద‌రి మ‌న‌సుల్లోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సీతారామం త‌ర్వాత మృణాల్ కు వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆమె మాత్రం చాలా సెలెక్టివ్ గా సినిమాల‌ను ఎంచుకుంటూ కెరీర్లో స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.

డెకాయిట్ లో విభిన్న పాత్ర‌

సీతారామం త‌ర్వాత హాయ్ నాన్న తో మ‌రో హిట్ ను అందుకున్న మృణాల్, ఓ వైపు తెలుగులో సినిమాలు చేస్తూనే మ‌రోవైపు బాలీవుడ్ లోనూ అవ‌కాశాలను అందుకుంటున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో అడివి శేష్ స‌ర‌స‌న డెకాయిట్ అనే సినిమాలో న‌టిస్తున్నారు మృణాల్. ఈ సినిమాలో మృణాల్ పాత్ర చాలా కొత్త‌గా ఉండ‌బోతున్న‌ట్టు ఇప్ప‌టికే రిలీజైన ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది.

అల్లు అర్జున్ మూవీలో మృణాల్

ఇక అస‌లు విష‌యానికొస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. దీపికా ప‌దుకొణె హీరోయిన్ గా న‌టించ‌నున్న ఈ సినిమాలో మ‌రో ఇద్ద‌రు హీరోయిన్లకు కూడా స్కోప్ ఉంద‌ని, ఆ ఇద్ద‌రిలో ఒక‌రిగా మృణాల్ ఎంపిక‌య్యార‌ని ఎప్ప‌ట్నుంచో వార్త‌లొస్తున్నాయి. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో భాగంగా మృణాల్ ను అల్లు అర్జున్ తో చేయ‌బోయే సినిమా గురించి హోస్ట్ అడిగారు.

ఆ ప్ర‌శ్న‌కు ఆశ్చ‌ర్య‌పోయిన మృణాల్, నేను అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తున్నానా? అది నిజంగా జ‌ర‌గాల‌ని ప్రార్థించ‌మ‌ని, అనుకున్న‌ట్టు జ‌రిగితే దాన్ని సెల‌బ్రేట్ చేసుకోవ‌డంతో పాటూ మ‌ళ్లీ మ‌రో ఇంట‌ర్వ్యూ ఇస్తాన‌ని మృణాల్ చెప్ప‌డంతో అల్లు అర్జున్- అట్లీ మూవీలో మృణాల్ న‌టించ‌డం లేద‌నే విష‌యంలో అంద‌రికీ క్లారిటీ వ‌చ్చింది.

ఇక అల్లు అర్జున్- అట్లీ సినిమా గురించి చెప్పాలంటే ఈ మూవీ AA22 వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్కుతోంది. సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతుంది. పుష్ప‌2 త‌ర్వాత బ‌న్నీ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో అంద‌రికీ దీనిపై భారీ అంచ‌నాలున్నాయి. ఈ మూవీలో హీరో క్యారెక్ట‌ర్ మూడు విభిన్న కోణాల్లో ఉంటుంద‌ని స‌మాచారం. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో భారీ వీఎఫ్ఎక్స్ ఉండ‌నున్నాయి.

Tags:    

Similar News