వారణాసి.. ఇది జక్కన్న మైండ్ గేమ్

వారణాసి విడుదలకు ఇంకా ఏడాది కంటే ఎక్కువ టైమ్ ఉంది. అయినప్పటికీ రాజమౌళి రెగ్యులర్ ప్రమోషన్ అన్నట్లుగా ఇప్పుడే టీమ్ ను హాలీవుడ్ మీడియా ముందుకు దించడం వెనుక పక్కా మైండ్ గేమ్ అని అర్ధమవుతుంది.;

Update: 2026-02-04 08:43 GMT

వారణాసి విడుదలకు ఇంకా ఏడాది కంటే ఎక్కువ టైమ్ ఉంది. అయినప్పటికీ రాజమౌళి రెగ్యులర్ ప్రమోషన్ అన్నట్లుగా ఇప్పుడే టీమ్ ను హాలీవుడ్ మీడియా ముందుకు దించడం వెనుక పక్కా మైండ్ గేమ్ అని అర్ధమవుతుంది. బాహుబలిని చైనాలో, ఈగను జపాన్‌లో ముందే రుచి చూపించి, తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్‌ను వరల్డ్ వైడ్ సినిమా లవర్స్‌లో క్రియేట్ చేసుకున్నారు.

ఇక ఆర్‌ఆర్‌ఆర్‌లోని 'నాటు నాటు' సాంగ్ ఆస్కార్ గెలవడం ఒక ఎత్తయితే, నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఆ సినిమా గ్లోబల్ ఆడియన్స్‌కు విపరీతంగా కనెక్ట్ అవ్వడం మరో ఎత్తు. ఇప్పుడు 'వారణాసి' సినిమా విషయంలో రాజమౌళి స్ట్రాటజీ నెక్స్ట్ లెవల్‌లో ఉంది. గత సినిమాలతో తన టాలెంట్ ఏంటో ప్రపంచానికి పరిచయం చేసిన జక్కన్న, ఇప్పుడు నేరుగా హాలీవుడ్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ ద్వారా ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

సినిమా రిలీజ్ అయ్యాక విదేశీయులు చూడటం కాదు, రిలీజ్ రోజే వరల్డ్ వైడ్ ఆడియన్స్ థియేటర్ల దగ్గర క్యూ కట్టాలనేది అసలు టార్గెట్ అని అర్ధమవుతుంది. అందుకే కొలైడర్ వంటి ఇంటర్నేషనల్ వేదికలపై ఇప్పుడు నుండే బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాజమౌళి ఇప్పుడు హాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. విదేశీయులకు మన ఊరి కథలను వాళ్లకు అర్థమయ్యే టెక్నికల్ స్టాండర్డ్స్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు.

ఐమాక్స్ షూటింగ్, రియల్ విజువల్స్ గురించి రాజమౌళితో పాటు ప్రియాంక, పృథ్వీరాజ్, మహేష్ మాట్లాడుతున్న తీరు వెస్ట్రన్ ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచుతోంది. మహేష్ బాబును ఒక గ్లోబల్ హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూనే, మన ఇండియన్ మైథాలజీ సోల్‌ను ఆ యాక్షన్ అడ్వెంచర్‌కు జోడించడం జక్కన్న మార్క్ స్ట్రాటజీ. ఈగ, బాహుబలి, RRR సినిమాలతో సృష్టించిన ఇంపాక్ట్ ఇప్పుడు 'వారణాసి'కి పెద్ద ప్లస్ కానుంది.

హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఫిల్మ్స్ చూసే ప్రేక్షకులకు 'వారణాసి' ఒక పక్కా లోకల్ ప్లస్ గ్లోబల్ ట్రీట్‌లా అనిపిస్తుంది. రిలీజ్ రోజునే ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ద్వారా ఒక ఇండియన్ సినిమా హాలీవుడ్ మూవీస్ రికార్డులను సైతం సవాల్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తోంది. అలాగే 'వారణాసి' బిజినెస్ పరంగా కూడా గ్లోబల్ లో లెవెల్ మార్కెట్ లో అప్పర్ హ్యాండ్ క్రియేట్ చేసేందుకు అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనా రాజమౌళి పక్కా గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నట్లే అనిపిస్తుంది. మరి సినిమా నెక్స్ట్ అప్డేట్స్ ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News