థియేటర్స్‌లో నిరాశ.. ఓటీటీలో మాత్రం భారీ క్రేజ్!
ఈ మధ్య కాలంలో సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా కొన్ని వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.
ఈ మధ్య కాలంలో సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా కొన్ని వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో భారీ ఖర్చుల వల్ల చూడలేకపోయిన ప్రేక్షకులు, ఇప్పుడు ఇంట్లోనే ప్రశాంతంగా ఓటీటీల్లో సినిమాలు చూస్తున్నారు. అందుకే థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, కొన్ని సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో మాత్రం రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. థియేటర్లలో మిస్ అయి, ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న అలాంటి 5 సినిమాల విశేషాలు ఇప్పుడు చూద్దాం!
విష్ణు విన్యాసం: అమెజాన్ ప్రైమ్‌లో టాప్ ట్రెండింగ్:
శ్రీవిష్ణు, నయన్ సారిక జంటగా నటించిన సినిమా 'విష్ణు విన్యాసం'. థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. కానీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చాక సీన్ రివర్స్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ కంటెంట్ బాగా నచ్చడంతో ప్రస్తుతం ఇది ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
డ్రింకర్ సాయి: జీ5 లో నంబర్ వన్:
చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చిన 'డ్రింకర్ సాయి' బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. కానీ జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చాక ఈ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ దక్కింది. యూత్ ఈ సినిమాను బాగా ఆదరించడంతో ఓటీటీలో నంబర్ వన్ ట్రెండింగ్ మూవీగా నిలిచింది.
ఎల్ఐకె : ఓటీటీలో దూసుకుపోతున్న ప్రదీప్ సినిమా:
ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విగ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'ఎల్ఐకె'. థియేటర్ ఆడియన్స్‌ను అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా, ఓటీటీ ప్రియులను మాత్రం బాగా అలరిస్తోంది.ఇక ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో 3వ స్థానంలో ట్రెండ్ అవుతూ మంచి వ్యూస్ రాబడుతోంది.
గాయపడ్డ సింహం: నవ్వులు పూయిస్తున్న తరుణ్ భాస్కర్:
తరుణ్ భాస్కర్ నటించిన సరికొత్త ఫన్ ఎంటర్టైనర్ మూవీ 'గాయపడ్డ సింహం'. థియేటర్లలో పెద్దగా సౌండ్ చేయని ఈ సినిమా, ప్రైమ్ వీడియోలో మాత్రం 5వ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. ఇంట్లోనే కూర్చుని కాసేపు నవ్వుతూ ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులకు ఇది బెస్ట్ ఛాయిస్‌గా మారింది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి :
ఇటీవల కాలంలో రవితేజ నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', అలాగే కమల్ హాసన్ నటించిన 'థగ్ లైఫ్' చిత్రాలు థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలై యావరేజ్ లేదా ఫ్లాప్‌గా మిగిలాయి. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ అయ్యాక మాత్రం వీటికి రికార్డు స్థాయి వ్యూస్ వచ్చాయి. ఇక స్టార్ హీరోల సినిమాలు కావడంతో డిజిటల్‌లో ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు.
డబ్బులు, సమయం ఆదా అవుతుండటం.. నచ్చిన టైమ్‌లో ఫ్యామిలీతో కలిసి ప్రశాంతంగా చూసే అవకాశం ఉండటంతో ఓటీటీల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. థియేటర్లలో నిరాశపరిచిన యాక్షన్, క్రైమ్, ఫన్ సినిమాలు కూడా ఓటీటీలో మంచి టైమ్‌పాస్ ఆప్షన్స్‌గా మారి సక్సెస్ అవుతున్నాయి.