సెట్స్ మీదున్న స్టార్స్ సినిమా విషయాలు..!

టాలీవుడ్ లో షూటింగ్ ల సందడి మొదలైంది. ప్రతి హీరో తాము కమిటైన సినిమాల షూటింగ్స్ తో బిజీ బిజీగా ఉన్నారు.;

Update: 2025-07-10 04:05 GMT

టాలీవుడ్ లో షూటింగ్ ల సందడి మొదలైంది. ప్రతి హీరో తాము కమిటైన సినిమాల షూటింగ్స్ తో బిజీ బిజీగా ఉన్నారు. సెట్స్ మీద ఉన్న తారాల సినిమాల ముచ్చట్లు తెలుసుకోవాలని.. ఆ సినిమాల అప్డేట్స్ వినాలని అందరికీ ఉంటుంది. ఐతే అలాంటి అప్డేట్స్ ఈమధ్య సోషల్ మీడియాలో అందరు చెప్పేస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి అవేంటో ఒకసారి చూసేద్దాం.

మెగాస్టర్ చిరంజీవి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగా 157 సినిమాగా ఒక ప్రాజెక్ట్ వస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి పీ.ఈ.టి మాస్టర్ గా కనిపించనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో చిరంజీవి పేరు శివ శంకర వర ప్రసాద్ అని టాక్. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా ఇది వస్తుంది.

ఇక ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా హర్రర్ కామెడీ బొమ్మగా వస్తుంది. ఈ సినిమా టీజర్ తోనే సూపర్ హై ఇచ్చాడు డైరెక్టర్ మారుతి. డిసెంబర్ 5న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది రాజా సాబ్.

ఈమధ్యనే సూర్య, వెంకీ అట్లూరి సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. ఫ్యామిలీ డ్రామా విత్ హై ఎమోషన్స్ తో ఈ మూవీ వస్తుందట. సూర్య సన్నాఫ్ సత్య తరహాలోనే ఈ సినిమాకు విశ్వనాథన్ అండ్ సన్స్ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమితా బైజు కథానాయికగా నటిస్తుంది.

వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా కూడా ఫ్యామిలీ డ్రామాగా రాబోతుంది. రైటర్ గా వెంకటేష్ కి సూపర్ హిట్లు ఇచ్చిన త్రివిక్రం ఈసారి ఆయన్ని హీరోగా ఒప్పించి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కేరాఫ్ ఆనంద నిలయం, ఆనంద రామయ్య టైటిల్స్ చూస్తున్నారట.

మాస్ మహారాజ్ రవితేజ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో సినిమా రీసెంట్ గా షూటింగ్ మొదలైంది. ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ మూవీకి అనార్కలి అనే టైటిల్ పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఇవే కాకుండా చరణ్ పెద్ది, మహేష్ రాజమౌళి సినిమా, అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ ఇలా స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా అనుకున్న ప్రకారం షెడ్యూళ్లు జరుగుతున్నాయి.

Tags:    

Similar News