టాలీవుడ్ ప్యూచ‌ర్ పాన్ ఇండియా స్టార్లు!

మ‌రి ప్యూచ‌ర్ పాన్ ఇండియా స్టార్లు అవ్వ‌డానికి అవ‌కాశం ఉన్న టాలీవుడ్ న‌టులు ఎవ‌రు అంటే? ప్ర‌ముఖంగా కొన్ని పేర్లు ప్ర‌స్తావించొచ్చు.;

Update: 2026-02-24 13:30 GMT

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్లు అంటే? ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్, బ‌న్నీ. ఈ నలుగురే ప్ర‌ధానంగా క‌నిపిస్తారు. సీనియ‌ర్ల‌లో చిరంజీవి, బాల‌య్య లాంటి వారు పాన్ ఇండియా అటెంప్ట్ చేసారు కానీ ఫెయిల‌య్యారు. అప్ప‌టి నుంచి పాన్ ఇండియా చిత్రాల‌కు దూరంగా ఉన్నారు. రీజ‌న‌ల్ మార్కెట్లో సినిమాలు చేయ‌డం లేదు. మ‌రి ప్యూచ‌ర్ పాన్ ఇండియా స్టార్లు అవ్వ‌డానికి అవ‌కాశం ఉన్న టాలీవుడ్ న‌టులు ఎవ‌రు అంటే? ప్ర‌ముఖంగా కొన్ని పేర్లు ప్ర‌స్తావించొచ్చు.

యువ హీరో నిఖిల్ సిద్దార్ద్. ఇత‌డు `కార్తికేయ‌2` తో ఓ పాన్ ఇండియా సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇండియాలో మంచి విజ‌యం సాధించింది. హిందుత్వం కాన్సెప్ట్ తో ఇండియా వైడ్ ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయ్యాడు. అప్ప‌టి నుంచి పాన్ ఇండియా కాన్సెప్ట్ ల‌పైనే ఆస‌క్తిగా ఉన్నాడు. ప్ర‌స్తుతం `స్వ‌యంభూ` అనే ఓ పీరియాడిక్ యాఓన్ చిత్రం చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో మంచి బ‌జ్ నెలకొంది. రెగ్యుల‌ర్ క‌మర్శియ‌ల్ చిత్రాల‌కు నిఖిల్ దూరంగా ఉంటాడు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ లు ఎంచుకోవ‌డం నిఖిల్ ప్ర‌త్యేక‌త‌. అదే నిఖిల్ ను భ‌విష్య‌త్ లో పాన్ ఇండియాలో అగ్ర హీరోల స‌ర‌స‌న నిల‌బెట్టే అవ‌కాశం ఉంది.

అలాగే మ‌రో యంగ్ హీరో తేజ స‌జ్జా కూడా తెలివిగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. తొలి సినిమా `హ‌నుమాన్` తో పాన్ ఇండియాలో మంచి విజ‌యం అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఆత‌ర్వాత గ‌త ఏడాది `మిరాయ్` తో చ‌క్క‌ని విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ యంగ్ హీరోకి హిందుత్వం కాన్సెప్ట్ క‌లిసొచ్చింది. ల‌వ్ స్టోరీలు..యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్లు కాకుండా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ల‌ను ఎంచుకుంటూ ప్ర‌యాణాన్ని ముందుకు సాగిస్తున్నాడు. మ‌రో ప్యూచ‌ర్ పాన్ ఇండియా స్టార్ అడ‌వి శేష్. ఇత‌డు మ‌ల్టీ ట్యాలెంటెడ్ ప‌ర్స‌నాల్టీ.

న‌టుడే కాదు అంత‌కు మించి రైట‌ర్ కూడా. వైవిథ్య‌మైన సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ను సంపాదించుకున్నాడు. దేశ భ‌క్తి నేప‌థ్యం గ‌ల సినిమాలు చేయాలంటే? శేషు మాత్ర‌మే ఆప్ష‌న్ గా క‌నిపిస్తున్నాడు. స్పై థ్రిల్ల‌ర్లు ఇత‌డి ప్ర‌త్యేక‌త‌. ఇదే అత‌డిని భ‌విష్య‌త్లో పాన్ ఇండియాలో అగ్ర న‌టుడిగా నిల బెడుతుంది. అలాగే నేచుర‌ల్ స్టార్ నాని పాన్ ఇండియా ప్ర‌య‌త్నాలు ఇప్పుడే మొద‌లు పెట్టాడు. `ది ప్యార‌డైజ్` తో పాన్ ఇండియాలో కి ఎంట‌ర్ అవుతున్నాడు. రొటీన్ చిత్రాల‌కు నాని తొలి నుంచి దూరంగానే ఉన్నాడు. బ‌ల‌మైన క‌థ‌ల్లోనే అత‌డు న‌టిస్తాడు.

ఆషామాషీ క‌థ‌ల్లో క‌నిపించ‌డు. `ది ప్యార‌డైజ్` ను ఏకంగా గ్లోబ‌ల్ మార్కెట్ కే క‌నెక్ట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. సక్సెస్ అయిందంటే నాని పాన్ ఇండియా ఇమేజ్ రాత్రికి రాత్రే మారిపోతుంది. మ‌రో న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇంకా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్ట‌లేదు. `లైగ‌ర్` తో హిందీని ట‌చ్ చేసాడు. కానీ అంత‌కు ముందే `అర్జున్ రెడ్డి` విజ‌యంతో బాలీవుడ్ లోనూ వైర‌ల్ గా మారాడు. స‌రైన పాన్ ఇండియా కకాన్సెప్ట్ లో న‌టిస్తే విజ‌య్ ఇమేజ్ అమాంతం మారిపోతుంది. భ‌విష్య‌త్ లో పాన్ ఇండియాలో పెద్ద స్టార్ అవ్వ‌డానికి అన్ని ర‌కాల అర్హ‌త‌లు విజ‌య్ లో ఉన్నాయి.

Tags:    

Similar News