ఆస్కార్ కు పంపిన తెలుగు సినిమాలివే!
అయితే కలలు కనడం వరకే కానీ ఆ అవార్డు దక్కడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఇప్పటివరకు ఆస్కార్ దక్కించుకున్న ఏకైక ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ మాత్రమే.;
సినీ ఇండస్ట్రీలో ఆస్కార్ అనేది ఎంత పెద్ద గౌరవమో ప్రత్యేకంగా చెప్పే పన్లేదు. సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతీ ఒక్కరూ తమ లైఫ్ లో ఒక్కసారైనా ఆ ఆస్కార్ ను గెలుచుకోవాలని కలలు కంటూనే ఉంటారు. అయితే కలలు కనడం వరకే కానీ ఆ అవార్డు దక్కడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఇప్పటివరకు ఆస్కార్ దక్కించుకున్న ఏకైక ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ మాత్రమే.
ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ ను దక్కించుకున్న టాలీవుడ్
గతంలో పలువురు ఇండియన్స్ కు ఆస్కార్ వచ్చినప్పటికీ ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మాత్రం ఏ ఇండియన్ సినిమా ఇప్పటివరకు అవార్డును దక్కించుకోలేదు. అయితే ఈసారి ఇండియా నుంచి ఈ కేటగిరీలో ఎంట్రీ కోసం ఐదు తెలుగు సినిమాలు పోటీ పడినప్పటికీ, అవేమీ ఫైనల్ లిస్ట్ వరకు వెళ్లలేకపోయాయి. విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ కు పంపిన సినిమాల లిస్ట్ ను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా వెల్లడించగా అందులో 5 తెలుగు సినిమాలున్నాయి.
ఆ సినిమాలే పుష్ప2, గాంధీ తాత చెట్టు, కన్నప్ప, సంక్రాంతికి వస్తున్నాం మరియు కుబేర. పుష్ప2 సినిమా దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఎంతోమంది ఇండియన్స్ పుష్ప2 ను చూసి ఎంజాయ్ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకుని కమర్షియల్ గా సక్సెస్ అయింది. టాలీవుడ్ నుంచి ఈ 5 సినిమాలను ఆస్కార్ కు పంపినప్పటికీ అవేవీ ఫైనల్ లిస్ట్ వరకు వెళ్లలేకపోయాయి.
ఆస్కార్ కు ఎంపికైన హోమ్ బౌండ్
కాగా ఇండియా నుంచి ఒకే ఒక సినమా ఆస్కార్ కు ఎంపికైంది. నీరజ్ గైవాన్ దర్శకత్వంలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన హోమ్ బౌండ్ సినిమా ఇండియా తరపున ఆస్కార్ కు ఎంపికైంది. ఆస్కార్ లో ఫైనల్ లిస్ట్ కు చేరిన హోమ్ బౌండ్ పలు సినిమాలతో పోటీ పడి గెలవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 26న హోమ్ బౌండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా ఆస్కార్స్ కు ఎంపికవడంతో సినిమాపై రిలీజ్ కు ముందు మంచి బజ్ ఏర్పడే ఛాన్సుంది. మరి హోమ్ బౌండ్ సినిమా ఆస్కార్ ను గెలిచి రికార్డు సృష్టిస్తుందో లేదో చూడాలి.