పిక్‌టాక్‌ : మూడో బిడ్డతో శ్రీలీల

ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లిలా ఆలనా పాలన చూసుకుంటూ ఉన్న శ్రీలీల మరో పాపను తన ఇంటికి తీసుకు వచ్చినట్లు చెప్పుకొచ్చింది.;

Update: 2025-04-28 06:47 GMT

హీరోయిన్‌ శ్రీలీల వయసు చిన్నదే కానీ ఆమె ఆలోచన విధానం చాలా పెద్దది. నిండా పాతికేళ్లు లేని ఈ హీరోయిన్‌ ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్‌ చేయలేని పనిని చేస్తూ తన మంచి మనసు చాటుకుంటుంది. సాధారనంగా అనాధలకు సహాయంగా నిలిచేందుకే పలువురు సెలబ్రిటీలు ఆసక్తి చూపించరు. అలాంటిది శ్రీలీల ఏకంగా ఇద్దరు వికలాంగులు అయిన పిల్లలను దత్తత తీసుకుని వారి ఆలనా పాలన చూస్తూ, తాను కూడా సమయం దొరికినప్పుడు వారితో ఆడుకుంటూ కనిపిస్తూ ఉంటుంది. శ్రీలీల ఇద్దరు పిల్లలను ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటూ వారికి కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తూ ఉంటుంది. శ్రీలీల మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ ఆమె అభిమానులు అంటూ ఉంటారు.


ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లిలా ఆలనా పాలన చూసుకుంటూ ఉన్న శ్రీలీల మరో పాపను తన ఇంటికి తీసుకు వచ్చినట్లు చెప్పుకొచ్చింది. ఒక చిన్నారికి ముద్దు పెడుతూ ఉన్న ఫోటోను శ్రీలీల షేర్‌ చేసింది. ఆ ఫోటోతో పాటు... ఇంటికి మరొకరు, హృదయాలను నింపేందుకు ఈ పాప వచ్చింది అన్నట్లుగా కామెంట్‌ పెట్టింది. ఇప్పటికే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న శ్రీలీల మరో పాపను దత్తత తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఆమె యొక్క మంచితనం ముందు ఇతర స్టార్‌ హీరోలు, హీరోయిన్స్‌ బలాదూర్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ముందు ముందు ఈమె మరింత మందికి సహాయం గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అందమైన రూపం ఉన్నవారికి అందమైన మనసు ఉండదని కొందరు అంటూ ఉంటారు. కానీ శ్రీలీల మాత్రం అందంగా ఉండటంతో పాటు అంత మంచి మనసు కలిగి ఉన్నది అనడంలో సందేహం లేదు. నటిగా ఎంత బిజీగా ఉన్నా ఆ పిల్లలతో సరదాగా సమయంను గడిపేందుకు శ్రీలీల సమయం కేటాయిస్తూ ఉంటుంది. పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో దక్కిన గుర్తింపు కారణంగా హిందీలో ఒక సినిమాను ఈమె చేసే అవకాశం దక్కించుకుంది. త్వరలోనే ఈమె మరో భారీ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. తెలుగులోనే కాకుండా తమిళ్‌, హిందీ సినిమాల్లోనూ ఈమె బిజీ బిజీగా సినిమాలు చేస్తూ వస్తోంది.

కన్నడ సినిమాలతో చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శ్రీలీల తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. తెలుగు సినిమా పెళ్లి సందడితో టాలీవుడ్‌లో పరిచయం అయింది. ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచినా తన అందంతో పాటు తన డాన్స్‌తో ప్రేక్షకులను మెప్పించింది. ఫిల్మ్‌ మేకర్స్‌కి ఈమె తెగ నచ్చడంతో తమ సినిమాల్లో వరుసగా ఆఫర్లు ఇస్తున్నారు.

ఈమెకు టాలీవుడ్‌లో ధమాకాతో మొదటి విజయం దక్కింది. ఆ తర్వాత నుంచి ఏడాదికి మూడు నాలుగు సినిమాల చొప్పున ఆఫర్లు వస్తున్నాయి. రవితేజతో కలిసి ధమాకా తర్వాత మరో సినిమాను చేస్తోంది. ఇంకా పలు తెలుగు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో మరో రెండు మూడు సినిమాలతో శ్రీలీల ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News