• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాని - నితిన్.. ఈ క్లాష్...

నాని - నితిన్.. ఈ క్లాష్ ఎలా ఉంటుందో?

| డిసెంబర్ మొదటి వారంలో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా ఏ స్థాయిలో హడావిడి మొదలు పెడుతుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది

By - Tupaki Desk
Update: 2023-11-28 16:29 GMT

డిసెంబర్ మొదటి వారంలో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా ఏ స్థాయిలో హడావిడి మొదలు పెడుతుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే ఈ సినిమా వచ్చిన వారం తర్వాత మన టాలీవుడ్ హీరోలు డిఫరెంట్ సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ముందుగా నాని డిసెంబర్ 7వ తేదీన హాయ్ నాన్న సినిమాను విడుదల చేయబోతున్నాడు. ఇక ఒక్కరోజు గ్యాప్ లోనే నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ అనే సినిమాతో రాబోతున్నాడు.

అసలైతే ఈ పోటీలో వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా ఉండాలి. కానీ ఆ రెండు సినిమాలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఇక డిసెంబర్ 2 వ వారం నాని నితిన్ ఇద్దరు కూడా పాజిటివ్ హైప్ తో రాబోతున్నారు. ఒక విధంగా ఈ రెండు సినిమాలు వేటికవే విభిన్నంగా ఉన్నాయి అని చెప్పవచ్చు.

నాని నటించిన హాయ్ నాన్న సినిమా ఇప్పటికే టీజర్ ట్రైలర్ అలాగే సాంగ్స్ తో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంది. కూతురు సెంటిమెంట్ తో పాటు హీరో హీరోయిన్ మధ్యలో ఉండే లవ్ స్టోరీ కూడా ఈ సినిమాలో హైలెట్ కాబోతోంది. ఇక కొత్త దర్శకుడు శౌర్యువ్ ట్రైలర్ తోనే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాడు. ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ప్రతిసారి కూడా నాని అయితే పెద్దగా నిరాశపరచలేదు. అతని గత సినిమాలు నిన్ను కోరి అలాగే జెర్సీ రెండు కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాయి.

ఇక ఇప్పుడు హాయ్ నాన్న కూడా అదే తరహాలో ఆకట్టుకునే అవకాశం అయితే ఉంది. దానికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ అందించిన ట్యూన్స్ కూడా బాగా క్లిక్ అయ్యాయి. ఇక నితిన్ విషయానికి వస్తే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకోవాలి అని రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు టాలెంటెడ్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా సాంగ్స్ కూడా ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేశాయి అలాగే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కూడా అంచనాల స్థాయిని మరో లెవెల్ కు తీసుకువెళ్లాయి.

ఈ సినిమాలో ఫన్ ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ డోస్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కమర్షియల్ ఫార్మాట్లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఏమాత్రం పాజిటివ్ వచ్చిన కూడా ఈ సినిమాకు కూడా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ అయితే వస్తాయి. ఇక నితిన్ న్యూ స్టైల్ తో పాటు డైరెక్టర్ వంశీ పెన్ పవర్ ఈ సినిమాకు హెల్ప్ అయితే సినిమా రిజల్ట్ మామూలుగా ఉండదు. మొత్తానికి డిసెంబర్ రెండవ వారంలో బాక్సాఫీస్ వద్ద పోటీ మాత్రం చాలా ఆసక్తిగా ఉండబోతోంది. ఒకరు ఎమోషనల్ కంటెంట్ ను నమ్ముకుంటే మరొకరు ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్నారు. ఇక ఈ రెండు సినిమాలకి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి అంచనాలను ఎంతవరకు అందుకుంటాయో చూడాలి.

Tags:    
  • Nani 
  • HiNanna 
  • Nithiin 
  • Extraordinaryman 
  • Tollywood 
  • Animal 
  • Filmindustry 
  • Mrunal 
  • Sreeleela 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS