• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'టిల్లు స్క్వేర్'లో...

'టిల్లు స్క్వేర్'లో త్రివిక్రమ్​ హ్యాండ్?

| 'డీజే టిల్లు' చిత్రంతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్​ అందుకున్న యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ.. ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారారు

By - Tupaki Desk
Update: 2023-09-18 17:30 GMT

'డీజే టిల్లు' చిత్రంతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్​ అందుకున్న యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ.. ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారారు. అయితే ఆయన దేనికి తొందరపడకుండా.. ఆచితూచి కథలను ఎంచుకుంటూ కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. కాస్త ఆలస్యమైనా మంచి ఔట్ ఫుట్స్​తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం సిద్ధు.. తనకు భారీ స్టార్ డమ్​ను అందించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ డీజే టిల్లుకు సీక్వెల్​గా 'టిల్లు స్క్వేర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌-ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నిర్మిస్తున్నాయి. నాగవంశీ, సాయి సౌజన్య(త్రివిక్రమ్ భార్య) నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తైపోయిందట. దర్శకుడు త్రివిక్రమ్ రెండు సార్లు సినిమా చూసి కొన్ని మార్పులు సూచించారట. కొన్ని సన్నివేశాలను రీషూట్​ చేయాలని చెప్పారట. దీంతో సిద్ధూతో పాటు ఇతర మూవీటీమ్​ ఆ పనిలో బిజీగా ఉందట. ఎలాగో ఈ సినిమాకు నాన్ థియేట్రికల్​ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయని తెలిసింది. కాబట్టి బడ్జెట్ విషయంలో కూడా ఏమాత్రం రాజీపడకుండా చూసుకుంటున్నారట. త్వరలోనే మిగిలిన పోర్షన్​ను ఔట్ పుట్ మంచిగా వచ్చేలా రీషూట్ చేసి పూర్తి చేస్తారట.

ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్​లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇకపోతే ఈ చిత్రంలో నేహాశెట్టి(రాధిక) కాకుండా అనుపమ పరమేశ్వరన్​ హీరోయిన్​గా చేస్తోంది. డబుల్ ఎంటర్టైన్మెంట్​తో ఈ సినిమా రానుంది. మొదటి భాగానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా.. ఇప్పుడు సీక్వెల్ టిల్లు స్క్వేర్​కు మాత్రం మల్లిక్ రామ్ డైరెక్ట్​ చేస్తున్నారు.

ఇకపోతే సిద్ధు.. టిల్లు స్క్వేర్​తో పాటు మరో చిత్రం కూడా చేస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. SVCC బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్​గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించుకుంది. ఇప్పుడిప్పుడే మంచి క్రేజ్​ను సంపాదించుకుంటున్న సిద్ధు కెరీర్​కు బొమ్మరిల్లు భాస్కర్​తో చేయబోయే సినిమా బాగా ప్లస్​ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో మోస్ట్ వాంటెడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీలను హీరోయిన్ తీసుకుంటారని ప్రచారం సాగింది.

Tags:    
  • Tillusquaremovie 
  • Trivikram 
  • Siddhujonnalagadda 
  • Djtillu 
  • Anupama 
  • Tollywood 
  • Trivikramsrinivas 

Similar News

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

Copyright @2026

Powered by Blink CMS