థగ్ లైఫ్: ఓటీటీ ఆలస్యమే కానీ.. మంచి నిర్ణయం!
కమల్ హాసన్, మణిరత్నం లాంటి లెజెండరీ కాంబినేషన్ 38 ఏళ్ల తర్వాత తిరిగి రీయూనైటవడం థగ్ లైఫ్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మారింది;
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం థగ్ లైఫ్ సినిమా మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. కమల్ హాసన్, మణిరత్నం లాంటి లెజెండరీ కాంబినేషన్ 38 ఏళ్ల తర్వాత తిరిగి రీయూనైటవడం థగ్ లైఫ్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మారింది. శింబు, త్రిష, ఐశ్వర్య లాంటి స్టార్ క్యాస్టింగ్‌తో ఈ సినిమా టాప్ ప్రాజెక్ట్‌గా ఫిక్స్ అయింది. ప్రస్తుతం ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం హైదరాబాద్‌కు వచ్చి ప్రెస్ మీట్ ద్వారా సినిమాపై పాజిటివ్ బజ్‌ను పెంచింది.
కమల్ హాసన్ మాట్లాడుతూ ఈ సినిమాకి తన జీవితంలో ప్రత్యేక స్థానం ఉన్న పాత్ర పోషిస్తున్నానని చెప్పారు. మణిరత్నం దర్శకత్వం ఈ సినిమా స్థాయిని మరింత పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, స్టిల్స్, ప్రెస్ మీట్ ఫోటోలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ప్రత్యేకంగా ఈ చిత్రం ఎమోషనల్‌గా సాగుతుందని, ఆవేశభరితంగా ప్రేక్షకులను టచ్ చేస్తుందని మణిరత్నం వ్యాఖ్యానించారు.
తాజాగా ఓటీటీలో విడుదల విషయంలో చిత్రబృందం తీసుకున్న నిర్ణయం ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా ఇప్పుడు థియేటర్లకు వచ్చిన సినిమా మూడు నాలుగు వారాల్లో ఓటీటీలో విడుదల అవుతుంది. అయితే థగ్ లైఫ్ మాత్రం ఎటువంటి హడావిడి లేకుండా ఎనిమిదో వారం ఓటీటీకి వస్తుంది. అంటే థియేటర్ లో సినిమా చూడాలంటేనే అవకాశం ఉంటుందని స్పష్టమవుతోంది. ఈ నిర్ణయంతో సినిమా లాంగ్ రన్‌కు గుడ్ బూస్ట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
సినిమా స్థాయిని దృష్టిలో ఉంచుకుంటే ఇది చిన్న నిర్ణయం కాదు. ముఖ్యంగా ప్రస్తుతం ఓటీటీకి వచ్చే వేగం, థియేటర్లలో ఆడియెన్స్ డ్రాప్ అయ్యే పరిస్థితులను చూస్తే థగ్ లైఫ్ నిర్ణయం అందరికీ మెచ్చుకునేలా మారింది. థియేటర్ కలెక్షన్ల విషయంలో సినిమాకు ఇది భారీ అడ్వాంటేజ్ అవుతుందని ట్రేడ్ వర్గాల అభిప్రాయం. సినిమా ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను థియేటర్లవైపు రప్పిస్తుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది.
ఓటీటీ డీల్స్ కమర్షియల్ గా ఎలాంటి ఫ్లాట్‌ఫారంలోనైనా సినిమాకు లాభం తీసుకురాగలవు. అయితే ఆ రూట్లో లాభం కంటే కూడా థియేటర్లో మంచి రన్ రావడం సినిమాకు గౌరవాన్ని, కలెక్షన్లను, క్రేజ్‌ను పెంచుతుంది. ఇక థగ్ లైఫ్ ఎగ్జాంపుల్ అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుందేమో చూడాలి. సినిమా జూన్ 5న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతుండగా.. కమల్ హాసన్‌కు ఇది మరో ఘన విజయం అవుతుందనే ఆశాభావంతో మేకర్స్ ఎదురుచూస్తున్నారు.