ఈ వారం బాక్సాఫీస్.. చిన్న సినిమాలు క్లిక్కయ్యేనా?
ప్రతి వారం థియేటర్లలో వివిధ సినిమాలు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వారం కూడా పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.;
ప్రతి వారం థియేటర్లలో వివిధ సినిమాలు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వారం కూడా పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ఈ వీక్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలదే హవా ఉండనుంది. మరి ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. ఆ ప్రాజెక్టుల వివరాలు మీకోసం..
టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రియదర్శి లీడ్ రోల్ నటించిన మూవీ సారంగపాణి జాతకం. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఆ సినిమాలో రూప కొడువాయూర్ హీరోయిన్ గా కనిపించనుంది. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో సందడి చేయనున్నారు. ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసిన ఆ మూవీ ఏప్రిల్ 25వ తేదీన విడుదల కానుంది.
అయితే టైటిల్, ప్రోమోల ప్రకారం కామెడీ అండ్ జ్యోతిషశాస్త్ర ఇతివృత్తంతో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఓ మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా.. లేక చేతల్లో ఉంటుందా అనే పాయింట్ చుట్టూ సినిమా తిరుగుతుందని అర్థమవుతోంది. ఓవైపు నమ్మకాలు మరోవైపు లవ్ చేసిన అమ్మాయి ప్రేమ మధ్య కొట్టుమిట్టాడిన యువకుడి స్టోరీనే మూవీ.
మరోవైపు, ఏప్రిల్ 25వ తేదీన చౌర్య పాఠం మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ధమాకా సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకున్న డైరెక్టర్ త్రినాథరావు నక్కిన.. నిర్మాతగా మారి నక్కిన నెరేటివ్స్ బ్యానర్ ను స్టార్ట్ చేశారు. ఆ బ్యానర్ పై రూపొందిన ఆ సినిమాలో ఇంద్ర రామ్ కీలక పాత్ర పోషించగా.. నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహించారు. నటి పాయల్ రాధాకృష్ణ ఫిమేల్ లీడ్ రోల్ లో నటించారు.
ట్విస్టులు, ఉత్కంఠతో కూడిన క్రైమ్ బేస్డ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చౌర్యపాఠం సినిమాపై ప్రమోషన్స్ తో హైప్ ఏర్పడింది. చౌర్య పాఠం అంటే దొంగతనం చేయడానికి ట్రిక్కులు కాదని, దొంగతనం చేయాల్సి వస్తే హీరో ఏం పాఠం నేర్చుకుంటాడనే పాయింట్ తో సినిమా రూపొందినట్లు ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
ఇంకోవైపు.. ప్రేమలు మూవీతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నస్లేన్ కె. గపూర్ నటించిన లేటెస్ట్ చిత్రం జింఖానా. ఇప్పటికే మలయాళంలో మంచి హిట్ గా నిలిచిన ఆ సినిమా.. ఏప్రిల్ 25వ తేదీన తెలుగులో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాక్సింగ్ స్టోరీ లైన్ తో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందినట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఆ మూడు సినిమాలతో పాటు గ్రౌండ్ జీరో, శివ శంభో, సూర్యాపేట జంక్షన్ మూవీస్ కూడా విడుదలవ్వనున్నాయి. మరి ఎలాంటి రిజల్ట్ అందుకుంటాయో చూడాలి.