స్టార్ కలరింగ్ కాదు.. హిట్టు సీక్రెట్ సూపర్ కంటెంటే ..!

ఇప్పుడు ఇదే తరహాలో ఆడియన్స్ ని నవ్వించడమే తమ ముఖ్య ఉద్దేశ్యంతో సూపర్ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.;

Update: 2025-11-08 14:10 GMT

పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ సినిమాలు చేస్తున్న హడావిడి ఒక పక్క అయితే చిన్న బడ్జెట్ తో మంచి కంటెంట్ తో వస్తున్న సినిమాలు మరోపక్క అన్నట్టుగా ఉంది. స్టార్ సినిమాలకు వందల కోట్ల బడ్జెట్, ఏళ్లకు ఏళ్లు టైం తీసుకుంటారు కానీ కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు ముఖ్యంగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే సినిమాలు పెద్దగా బడ్జెట్ ఎక్కువ అవసరం లేకుండానే యువ నటీనటులతోనే సూపర్ సక్సెస్ అందుకుంటున్నారు.

ఎంటర్టైనింగ్ సినిమాలకు మంచి క్రేజ్ తెచ్చిన సినిమా జాతిరత్నాలు..

అలాంటి ఎంటర్టైనింగ్ సినిమాలకు మంచి క్రేజ్ తెచ్చిన సినిమా జాతిరత్నాలు. అనుదీప్ కెవి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించారు. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంటర్టైన్ చేసి సూపర్ హిట్ అందుకుంది.

ఇక జాతిరత్నాలు సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ అందుకోగా బలగం సినిమా ఎమోషనల్ కాన్సెప్ట్ తో అదరగొట్టేసింది. కమెడియన్ వేణు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా గెలుచుకుంది. బలగం లాంటి చిన్న సినిమా సాధించిన విజయం చూసి కంటెంట్ ఉన్న సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ అయ్యింది.

కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో మ్యాడ్..

జాతిరత్నాలు తరహాలోనే కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ముగ్గురు కాదు కాదు నలుగురు కుర్రాళ్ల కథతో వచ్చిన సినిమా మ్యాడ్. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. యంగ్ యాక్టర్స్ అంతా తమ బెస్ట్ ఇచ్చి ఆడియన్స్ ని సూపర్ ఎంటర్టైన్ చేశారు. ఇదే ఊపుతో మ్యాడ్ సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు.

సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు కూడా ఇదే తరహాలో ఎంటర్టైన్మెంట్ బేస్ మీద ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు. డీజే టిల్లు అంటే చాలు సిద్ధు పంచులు గుర్తు చేసుకునేలా ఇంపాక్ట్ చూపించాడు. అంతేకాదు ఆ సినిమా సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ తో ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేశాడు సిద్ధు.

నితిన్ నార్నే ఆయ్.. విలేజ్ బ్యాక్ డ్రాప్ కథ..

డీజే టిల్లు క్యూబ్ కూడా ఉంటుందని ఐతే ఆ అస్త్రాన్ని అవసరమైనప్పుడు వాడతా అన్నాడు సిద్ధు. ఇక మ్యాడ్ సినిమాతో మెప్పించిన నితిన్ నార్నే ఆయ్ అంటూ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో వచ్చాడు. ఆ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఆయ్ సినిమా సక్సెస్ కూడా యువ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ సత్తా చాటింది.

ఇదే వరుసలో ఇదే కోనసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా కమిటీ కుర్రాళ్లు. ఈ సినిమా కూడా ఒక్కసారి ఆడియన్స్ అందరినీ సర్ ప్రైజ్ చేస్తూ సూపర్ హిట్ అందుకుంది. ప్రతి ఊళ్లో ఎలాగైతే కమిటీ కుర్రాళ్లు ఉంటారో ఈ సినిమా గురించి కూడా అంతటా చర్చ నడిచింది. కమిటీ కుర్రాళ్లు సినిమాను నిహారిక కొణిదెల నిర్మించారు.

మౌళి తనూజ్ ప్రశాంత్ లిటిల్ హార్ట్స్ ..

చిన్న బడ్జెట్ తో ఎంటర్టైనింగ్ సినిమా తీస్తే హిట్ అవుతుందని ప్రూవ్ చేసిన వాళ్లందరి దారిలోనే సాయి మార్తాండ వెళ్లి లిటిల్ హార్ట్స్ సినిమా చేశాడు. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా వచ్చిన లిటిల్ హార్ట్స్ మేకర్స్ కి హ్యూస్ ప్రాఫిట్స్ తెచ్చి పెట్టింది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వెరైటీగా చేసి సూపర్ అనిపించారు. తప్పకుండా లిటిల్ హార్ట్స్ సీక్వెల్స్ కూడా ఇదే రేంజ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తాయని చెప్పొచ్చు.

ఇలా ప్రతి సినిమా కథ, కథనం ఏదైనా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే ముఖ్య లఖ్యంతో వచ్చి అందులో సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఇదే తరహాలో ఆడియన్స్ ని నవ్వించడమే తమ ముఖ్య ఉద్దేశ్యంతో సూపర్ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ లు అంటూ హడావిడి చేస్తున్న ఈ టైంలో ఇలాంటి ఒక కథతో తిరువీర్ హీరోగా చేసిన ఈ సినిమాను రాహుల్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ముందు చెప్పినట్టుగానే ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకుని తీసిన సినిమాగా ఇది ప్రేక్షకులను మెప్పిస్తుంది.

ఇలాంటి సినిమాల వల్ల మరికొన్ని సినిమాలు.. మరికొంతమంది యువ దర్శకులు ఇలాంటి ప్రయత్నం చేస్తారు. స్టార్ సినిమాలు సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా బిజినెస్ లు జరుగుతాయి. కానీ ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తూ వెళ్తూనే మళ్లీ మళ్లీ అలాంటి ప్రయత్నాలు జరుగుతాయి. అంతేకాదు ఈ వీకెండ్ రిలీజైన 3 సినిమాల్లో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

Tags:    

Similar News