• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దళపతి గర్జనకు ముహూర్తం...

దళపతి గర్జనకు ముహూర్తం ఫిక్స్..!

| దళపతి విజయ్ హీరోగా హెచ్ వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా జన నాయగన్.

By - Tupaki Desk
Update: 2025-06-20 18:24 GMT

దళపతి విజయ్ హీరోగా హెచ్ వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా జన నాయగన్. కె.వి.ఎన్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ లాక్ చేశారు. దళపతి విజయ్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమితా బైజు కూడా నటిస్తుంది. దళపతి విజయ్ జన నాయగన్ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ రోర్ ఈ నెల 22న 12 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. దళపతి విజయ్ సినిమాలకు గుడ్ బై చెబుతూ ఫైనల్ గా చేస్తున్న సినిమా అవడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు చివరి సినిమాగా వస్తున్న జన నాయగన్ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుంది. జన నాయగన్ సినిమాను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

విజయ్ పొలిటికల్ జర్నీకి కూడా ఉపయోగపడేలా కూడా సినిమాను తీర్చిదిద్దుతున్నారని తెలుస్తుంది. దళపతి విజయ్ జన నాయగన్ ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు. సినిమా ఫస్ట్ రోర్ గా టీజర్ ని వదలనున్నారు. ఈ టీజర్ తోనే సినిమాపై ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారు. విజయ్ లాస్ట్ సినిమా కాబట్టి ఫ్యాన్స్ కి కావాల్సిన ఫీస్ట్ ఇచ్చేలా సినిమా ఉంటుందని అంటున్నారు.

ఐతే సినిమాలో పూజా హెగ్దే గ్లామర్ షో కూడా ఎట్రాక్ట్ చేసేలా డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడట. సినిమా రిలీజ్ కు ఎలాగు మరో ఆరు నెలలు టైం ఉంది కాబట్టి చాలా ఫోకస్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. దళపతి విజయ్ చివరి సినిమాగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా సినిమాను ప్లాన్ చేస్తున్నారట. 2026 పొంగల్ రేసులో రిలీజ్ అవుతున్న ఈ సినిమా భారీ రికార్డులను టార్గెట్ పెట్టుకుంది.

విజయ్ జన నాయగన్ సినిమా బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా కథ స్పూర్తితో తెరకెక్కుతుందని టాక్. ఐతే ఈ విషయంపై అటు జన నాయగన్ మేకర్స్ కానీ భగవంత్ కేసరి సినిమాకు సంబంధించిన వారు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. మూల కథను తీసుకుని అక్కడ ఆడియన్స్ కు తగినట్టుగా జన నాయగన్ ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

Tags:    
  • JanaNayagan 
  • ThalapathyVijay 
  • VijayLastFilm 
  • Pongal2026 
  • AnirudhMusic 
  • JanaNayaganMovie 
  • JanaNayaganRelease 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS