ట్రెండింగ్ లో.. బాలీవుడ్ కాంట్ ఎఫర్డ్ మీ..!
అదేదో సైడ్ రోల్ గా కాదు.. లీడ్ రోల్ లోనే సినిమాలు చేయాలని చూస్తున్నారు. బాహుబలి నుంచి తెలుగు హీరోల మార్కెట్ బీభత్సంగా పెరిగింది.;
సౌత్ స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా స్టార్ గా మారారు. ముఖ్యంగా తెలుగులో ఏ స్టార్ కి చూసినా నేషనల్ వైడ్ ఫ్యాన్ బేస్ సంపాధించుకున్నారు. ప్రభాస్, రాం చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా అందరు కూడా బాలీవుడ్ ఆడియన్స్ మనసులు గెలిచారు. అందుకే అక్కడ మేకర్స్ కూడా మన స్టార్స్ తో సినిమాలు చేయాలని ముందుకొస్తున్నారు. అదేదో సైడ్ రోల్ గా కాదు.. లీడ్ రోల్ లోనే సినిమాలు చేయాలని చూస్తున్నారు. బాహుబలి నుంచి తెలుగు హీరోల మార్కెట్ బీభత్సంగా పెరిగింది. ఆ తర్వాత వచ్చిన పుష్ప, ఆర్.ఆర్.ఆర్ ఇలా అన్ని సినిమాలు హీరోల రేంజ్ పెంచేశాయి.
చరణ్ జంజీర్ అంటూ..
అందుకే అక్కడ మేకర్స్ మన వాళ్లని గురి పెట్టారు. ఆల్రెడీ దశాబ్దం క్రితమే చరణ్ జంజీర్ అంటూ ఒక బాలీవుడ్ అటెంప్ట్ చేశాడు. ఆ సినిమా రిలీజ్ తర్వాత ఎందుకు చేశామా అన్న ఆలోచన వచ్చింది. ఆ రేంజ్ డిజాస్టర్ అయ్యింది ఆ సినిమా. ఇక నెక్స్ట్ ఆఫ్టర్ లాంగ్ టైం ప్రభాస్ కి నార్త్ లో ఉన్న క్రేజ్ దృష్టి లో పెట్టుకుని ఓం రౌత్ ఆదిపురుష్ సినిమా చేశాడు. ఆ సినిమా పెద్దగ్సా ఆడలేదు.
ఇక లేటెస్ట్ గా యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ లో వచ్చిన వార్ 2 లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఈ సినిమా ముందు యావరేజ్ అనిపించినా కలెక్షన్స్ చూస్తే హ్యూజ్ లాస్ తప్పేలా లేదు. ఐతే ఈ కారణాలన్నీ చూసి తెలుగు ఆడియన్స్ తెలుగు స్టార్స్ హిందీ సినిమాలు పెద్దగా కలిసి రాలేదని చెబుతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాలీవుడ్ ఎంట్రీ పై..
ఇదే క్రమంలో మన స్టార్స్ ని అక్కడ మేకర్స్ సరిగా వాడుకోవట్లేదన్న కామెంట్ వినబడుతుంది. ఐతే ఈ టైం లోనే సూపర్ స్టార్ మహేష్ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. బాలీవుడ్ కాంట్ అఫర్డ్ మీ అంటూ మహేష్ ఒక బోల్డ్ కామెంట్ చేశాడు. అంటే బాలీవుడ్ నన్ను మోయలేదు అన్న ఉద్దేశ్యంతో మహేష్ ఆ కామెంట్ చేశాడు.
ఆ టైం లో మహేష్ కామెంట్ ని సరిగా అర్ధం చేసుకోలేదు కానీ.. ఆదిపురుష్, వార్ 2 సినిమాలు చూశాక మహేష్ అన్నది నిజమే అనిపిస్తుంది. తానింకా తెలుగులో చాలా చేయాలి. బాలీవుడ్ వెళ్లే ఆలోచన లేదు. చాలా ఆఫర్లు వస్తున్నాయ్ కానీ బాలీవుడ్ కాంట్ అఫర్డ్ మీ అంటూ అప్పుడు మహేష్ ఎందుకలా అన్నాడో ఇప్పుడు మన స్టార్స్ అక్కడ సినిమాలు చేసినా సరైన సక్సెస్ లు అందుకోలేకపోవడం చూసి మహేష్ కి ఇది ముందే తెలుసా అన్నట్టుగా చెప్పుకుంటున్నారు.
అంతేకాదు మహేష్ బాలీవుడ్ కి వెళ్తే అక్కడ స్టార్స్ కూడా గట్టి పోటీ ఏర్పడుతుంది. అందుకే తెలుగు సినిమాలతోనే పాన్ ఇండియా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు మహేష్. ఒకవేళ రాజమౌళి సినిమా తర్వాత మహేష్ కూడా బాలీవుడ్ సినిమా చేయొచ్చు కానీ అది కూడా మహేష్ రేంజ్ తెలిసేలా ఉంటేనే చేస్తాడు. అలాంటి కథ.. ఆ గ్రాండియర్ అన్నీ సరిచూసుకునే మహేష్ బాలీవుడ్ సినిమా చేస్తాడని చెప్పొచ్చు. ఈ విషయంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.