మిరాయ్ మేజిక్‌కి యూఎస్ టూర్.. తేజ సజ్జా స్పెషల్ గిఫ్ట్
వచ్చే వారాంతంలో మూడు నగరాల్లో స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. శుక్రవారం సియాటిల్‌లో, శనివారం డల్లాస్‌లో, ఆదివారం న్యూజెర్సీలో ఆయన అభిమానులను, ఆడియన్స్‌ను కలవనున్నారు.;
యంగ్ హీరో తేజ సజ్జా వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకుంటున్నారు. హనుమాన్ తర్వాత మిరాయ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్లు సాధిస్తూ పాన్ ఇండియా స్థాయిలో సంచలనంగా మారింది. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ఫ్యామిలీస్ నుంచి యూత్, కిడ్స్ వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్స్‌కి ఆకర్షిస్తోంది.
కేవలం ఇండియాలోనే కాదు, ఓవర్సీస్‌లోనూ మిరాయ్ కలెక్షన్ల దుమారం కొనసాగుతోంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక నార్త్ అమెరికాలో సినిమా 2 మిలియన్ డాలర్స్ మార్క్ దాటేసి, 2.5 మిలియన్ వైపు దూసుకెళ్తోంది. తెలుగు సినిమా హీరోలలో అగ్రశ్రేణి స్టార్స్ మాత్రమే సాధించిన ఈ స్థాయిని తేజ సజ్జా చాలా తక్కువ సమయంలో అందుకోవడం విశేషం.
హనుమాన్‌తో మొదలైన పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ జర్నీ మిరాయ్‌తో మరింత పటిష్టమైంది. యూఎస్ ఆడియన్స్‌కి ఈ సినిమా బాగా కనెక్ట్ కావడానికి మైథాలజీతో కలిపిన యాక్షన్, అడ్వెంచర్ కారణమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ భారీ విజయాన్ని జరుపుకోవడానికి తేజ సజ్జా స్వయంగా యూఎస్ టూర్‌కు సిద్ధమయ్యారు.
వచ్చే వారాంతంలో మూడు నగరాల్లో స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. శుక్రవారం సియాటిల్‌లో, శనివారం డల్లాస్‌లో, ఆదివారం న్యూజెర్సీలో ఆయన అభిమానులను, ఆడియన్స్‌ను కలవనున్నారు. ఈ టూర్‌కి ఇప్పటికే టికెట్ బుకింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. మిరాయ్ సినిమా విజయాన్ని యూఎస్ ఆడియన్స్‌తో కలిసి సెలబ్రేట్ చేయడానికి తేజ సజ్జా ఈ ప్రత్యేక టూర్‌ని ప్లాన్ చేయడం విశేషం.
తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్స్, బుకింగ్ లింక్స్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూఎస్‌లో ఉన్న తెలుగు కమ్యూనిటీతో పాటు స్థానిక ఇండియన్ సినీప్రియులు కూడా ఈ టూర్‌కి రెస్పాండ్ అవుతున్నారు. సాధారణంగా టాప్ స్టార్స్ మాత్రమే ఇలా స్పెషల్ టూర్లు చేస్తారు. కానీ ఒక యువ హీరో ఇంత చిన్న సమయంలో వరుస పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్‌తో ఈ రేంజ్‌లోకి రావడం అరుదైన విషయం.
అందుకే తేజ సజ్జా యూఎస్ టూర్‌పై ఫ్యాన్స్‌లో వేరే లెవెల్ ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది. మిరాయ్ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించారు. మనోజ్ మంచు విలన్‌గా నటించడం మరో హైలైట్. థియేట్రికల్ స్కేల్, విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు అన్నీ కలిసి సినిమా విజయానికి బలమైన పాయింట్లు అయ్యాయి.