హీరోతో యంగ్ బ్యూటీ డేటింగ్ వ్యవహారం
చంకీ పాండే నటవారసురాలు అనన్య పాండేను వెండితెరకు పరిచయం చేసిన కరణ్ జోహార్, ఔట్ సైడర్ తారా సుతారియాను కూడా వెండితెరకు పరిచయం చేసాడు.;
చంకీ పాండే నటవారసురాలు అనన్య పాండేను వెండితెరకు పరిచయం చేసిన కరణ్ జోహార్, ఔట్ సైడర్ తారా సుతారియాను కూడా వెండితెరకు పరిచయం చేసాడు. ఆ ఇద్దరూ ప్రతిభావంతులే అయినా కెరీర్ జర్నీ విభిన్నంగా సాగుతోంది. ఇద్దరూ నెమ్మదిగా పరిణతి చెందిన తారలుగా ఎదిగారు. కానీ అనన్య పాండే బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకోగా, తారా సుతారియా మాత్రం చాలా శ్రమించాల్సి వస్తోంది. కెరీర్ మ్యాటర్ లో తారా చాలా ఒత్తిడికి లోనయ్యానని, స్టార్ కిడ్స్ తో పోలిస్తే తనకు అవకాశాలు రావడం అంత సులువుగా లేదని కూడా అంగీకరించింది.
నెపో కిడ్స్ పై తారా కామెంట్లు ఇటీవల చర్చగా మారాయి. ఇండస్ట్రీలో తారా ప్రేమాయణాల గురించి కూడా చాలా ప్రచారం సాగింది. ఇప్పుడు తన సహనటుడు వీర్ పహారియాతో డేటింగ్ చేస్తోందంటూ కొత్త పుకార్ షికార్ చేస్తోంది. దీనికి కారణం ఓ ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొన్న ఆ ఇద్దరూ ఒకరికొనొకరు చూసుకుంటూ ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడమే. బహిరంగ వేదికపై పబ్లిగ్గా అలా చేయడంతో అగ్గి రాజుకుంది. ఆ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోంది! అంటూ నెటిజనులు ఊహాగానాలు సాగించారు.
అయితే వీర్ తో రిలేషన్ షిప్ గురించి ప్రశ్నించగా, తారా తనదైన శైలిలో స్పందించింది. ``ఇది చాలా ముద్దుగా ఉంది!`` అంటూ సింపుల్ గా స్పందించింది. అయితే వీర్ పహారియాతో రిలేషన్ షిప్ మ్యాటర్ ని తారా ధృవీకరించలేదు. అయితే అతడితో ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని కూడా చెప్పలేదు. ఇక వీర్ పహారియా .. జాన్వీ కపూర్, ఖుషి కపూర్, సారా అలీఖాన్ వంటి కథానాయికలకు కూడా సన్నిహితుడు.
తారా `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2` చిత్రంతో కథానాయికగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత హీరో పంథి 2, ఏక్ విలన్ రిటర్న్స్ వంటి సీక్వెల్ చిత్రాల్లో నటించింది. వీర్ పహారియా `స్కై ఫోర్స్` అనే చిత్రంతో పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ మరో కథానాయకుడిగా నటించారు.