తల్లి ముందే స్మోక్ చేసిన హీరోయిన్
కానీ మరో కీలక పాత్రలో నటించిన స్వసిక విజయ్ మాత్రం తమ్ముడు సినిమా కోసం ఓ స్పెషల్ సవాల్ ను స్వీకరించారు.;
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తమ్ముడు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించగా, ఆ ముగ్గురు హీరోయిన్లూ తమ్ముడు సినిమా కోసం ఒక్కో ప్రత్యేక టాలెంట్ ను కొత్తగా నేర్చుకున్నారు. తమ్ముడు సినిమా కోసం వర్ష బొల్లమ్మ కిక్ బాక్సింగ్ నేర్చుకోగా, మరో హీరోయిన్ సప్తిమి గౌడ తన క్యారెక్టర్ కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నారు.
కానీ మరో కీలక పాత్రలో నటించిన స్వసిక విజయ్ మాత్రం తమ్ముడు సినిమా కోసం ఓ స్పెషల్ సవాల్ ను స్వీకరించారు. తమ్ముడు సినిమాలోని తన పాత్ర కోసం ఆమె స్మోకింగ్ ను అలవాటు చేసుకున్నారట. తన క్యారెక్టర్ ప్రిపరేషన్ లో భాగంగా తాను స్మోక్ చేయడం నేర్చుకోవాలని డైరెక్టర్ శ్రీరామ్ వేణు తనకు చెప్పారని స్వసిక వెల్లడించారు.
దాని కోసం తాను ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం ప్రాక్టీస్ చేశానని, ఆఖరికి తన తల్లి ముందు కూడా తాను స్మోక్ చేశానని, ఇదంతా తన జాబ్ లో భాగమని తన తల్లికి చెప్పానని స్వసిక తెలిపారు. సినిమాలో మీరు చూసేది నిజమైన సిగార్లేనని, సినిమా మొత్తమ్మీద ఓ ఐదు సీన్లు మినహాయించి ప్రతీ సీన్ లోనూ తాను స్మోక్ చేస్తూనే కనిపిస్తానని, ఆ వాసనకు వాంతులు, తలనొప్పి కూడా వచ్చాయని ఆమె పేర్కొన్నారు.
మొత్తానికి తమ్ముడు సినిమా కోసం శ్రీరామ్ వేణు ప్రతీ హీరోయిన్ కీ ఓ స్పెషల్ మ్యానరిజంను ఇచ్చినట్టు అర్థమవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నితిన్ కు అక్కగా లయ నటిస్తుండగా, ఆమె కూడా సినిమాలో చెప్పుల్లేకుండా నటించాల్సి వచ్చిందని వెల్లడించిన సంగతి తెలిసిందే.