మగాళ్లను చీదరించుకునే మహిళలకు తమన్నా పాఠం
అయితే తమన్నా ఎవరిని ఉద్ధేశించి ఈ వ్యాఖ్యలు చేసింది? అంటే .. కచ్ఛితంగా తన జీవితంలో తారసపడిన ముఖ్యమైన వ్యక్తి నటుడు విజయ్ వర్మ.;
ఆంజనేయుడికి అయినా తన శక్తి గురించి ఇంకొకరు చెబితే కానీ తెలియలేదు. ఏ మహిళకు అయినా ఒక పురుషుడు తన శక్తి గురించి చెబితే కానీ తెలియదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది తమన్నా భాటియా. ``మహిళలు స్వయంగా శక్తివంతులు.. స్వయం ప్రకాశకులు. కానీ కొన్నిసార్లు ఆ ప్రతిబింబాన్ని చూడాలి. మగువ జీవితంలోని అద్భుతమైన పురుషులు దానిని గుర్తించడంలో సాయపడతారు`` అని తమన్నా వ్యాఖ్యానించింది. నా జీవితంలో అద్భుతమైన మగాళ్లున్నారు. నా సపోర్ట్ సిస్టమ్‌లో అలాంటి వ్యక్తులున్నారని తమన్నా అన్నారు.
అయితే తమన్నా ఎవరిని ఉద్ధేశించి ఈ వ్యాఖ్యలు చేసింది? అంటే .. కచ్ఛితంగా తన జీవితంలో తారసపడిన ముఖ్యమైన వ్యక్తి నటుడు విజయ్ వర్మ. అతడు తన జీవితంలో ప్రవేశించాక తమన్నా చాలా ఆనందంగా కనిపించింది. దురదృష్టవశాత్తూ ఈ జంట విడిపోయారు కానీ, కచ్ఛితంగా వారి మధ్య కెమిస్ట్రీ ఎంతో గొప్పగా కుదిరింది.
అయితే విజయ్ వర్మ- తమన్నా కెరీర్ పరమైన కొన్ని డిస్ట్రబెన్సెస్ కారణంగా విభేధించి విడిపోయారు కానీ వారి మధ్య అంతగా కలతలు లేవు. వెంటనే పెళ్లి చేసుకోవాలని విజయ్ ముందు తమన్నా ప్రతిపాదించింది. కానీ విజయ్ ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా ఎదుగుతున్నాం.. కొంత కాలం ఆగాలని సూచించాడు. 30 ప్లస్ లో తమన్నా జీవితంలో సెటిలవ్వాలని ఆశిస్తే, తానొకటి తలచిన చందంగా అయింది. కారణం ఏదైనా ఈ జంట విడిపోయిందన్నది వాస్తవం.
విడిపోయిన తర్వాత కూడా ఎంతో పరిణతితో ఆలోచించింది ఈ జంట. వారి మధ్య గొడవ అగ్లీగా మారకుండా, సామరస్యంగా ముగిసింది. ఇప్పటికీ ఒకరంటే ఒకరికి గౌరవం.. వారి మధ్య మంచి స్నేహం ఉంది. కానీ ఏదో ఒక చిన్న ఘర్షణ విడిపోవడానికి కారణమైంది. అయితే తమ బ్రేకప్ గురించి తమన్నా ఏనాడూ మీడియా ఎదుట బరస్ట్ అవ్వలేదు. కనీస మాత్రంగా అయినా మాట్లాడలేదు. తాజాగా ఓ కార్యక్రమంలో దీనిపై ఓపెనైంది. ఇది విజయ్ గురించిన వ్యాఖ్య అని అర్థమయ్యేలా ఒక మాట చెప్పింది తమన్నా. కానీ ఎంతో పరిణతితో ఒక పురుషుడిని అర్థం చేసుకున్న తీరుకు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి సమయాల్లో ఎదుటివారిని నిందించే వారితో పోల్చి చూస్తే, తమన్నాలోని పరిణతి అందరినీ ఆకట్టుకుంది. పురుషాధిక్య ప్రపంచం అంటూ సాధించుకు తినేసే మహిళా ప్రపంచంలో తమన్నా ఇతరులకు పెద్ద కనువిప్పు!