పిక్‌టాక్ : కిల్లింగ్‌ లుక్స్‌తో మిల్కీ బ్యూటీ

ఈమె చేసిన ఐటెం సాంగ్స్‌కి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో ముందు ముందు మరిన్ని చేసే అవకాశాలు ఉన్నాయి.;

Update: 2025-03-29 10:34 GMT

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు కావస్తుంది. 2005లో శ్రీ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించడంతో పాటు ఎన్నో ప్రత్యేక పాటల్లోనూ నటించిన విషయం తెల్సిందే. హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ ఈమధ్య కాస్త స్లో అయినప్పటికీ సోషల్‌ మీడియాలో మాత్రం క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈమె ఇప్పటికీ వరుసగా సినిమాలు చేయడంతో పాటు వెబ్‌ సిరీస్‌ల్లో నటించడంతో పాటు మ్యూజిక్‌ వీడియోలను సైతం వదలడం లేదు. ఈమె చేసిన ఐటెం సాంగ్స్‌కి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో ముందు ముందు మరిన్ని చేసే అవకాశాలు ఉన్నాయి.

సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఇలా అన్ని చోట్ల తన ప్రతిభను చూపిస్తూ తమన్నా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే ఉంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్‌తో సినిమాల్లో నటించడం ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ వస్తుంది. స్కిన్‌ షో చేసిన పాత్రలతోనే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లోనూ నటించడం ద్వారా తమన్నాకు మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ఈమె ఓదెల 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఆ సినిమాలో లేడీ అఘోరి పాత్రలో నటించడం ద్వారా సర్‌ప్రైజ్‌ చేయబోతుంది. అఘోరి పాత్రలో నటించేందుకు తమన్నా ఎలా ఒప్పుకుందంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇలాంటి ఫోటో షూట్స్‌తో తమన్నా సోషల్‌ మీడియాలో సందడి చేస్తూనే ఉంటుంది. ఈసారి మిల్కీ బ్యూటీ కవ్వించే చూపులతో చంపేస్తోంది. వయసు పెరిగినా కొద్ది తమన్నా మరింత అందంగా కనిపిస్తుందని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ స్థాయిలో మిల్కీ బ్యూటీ అందంగా కనిపిస్తున్న నేపథ్యంలో స్టార్‌ హీరోలు ఈమెను ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ కొందరు ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పదేళ్ల పాటు తమన్నా వరుసగా సినిమాలు చేసేంత సత్తా ఉంది. స్టార్‌ హీరోలకు పోటీగా ఆమె డాన్స్ చేయగలదు, కొత్త హీరోయిన్స్‌కి పోటీగా అందంగా కనిపించగలదు అంటూ ఈ ఫోటోలు చూస్తే నిరూపితం అవుతుందని నెటిజన్స్ అంటున్నారు.

మిల్కీ బ్యూటీ తమన్నా ముందు ముందు బాలీవుడ్‌లోనూ బిజీ కావడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. వెబ్‌ సిరీస్‌ల్లో నటించడం ద్వారా నటిగా తనలోని కొత్త యాంగిల్‌ను ప్రేక్షకుల ముందు పెట్టే ప్రయత్నాలు చేస్తుంది. మొత్తంగా తమన్నా ఇండస్ట్రీలో మరో పదేళ్ల పాటు ఇదే జోష్‌తో కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందమైన తమన్నా ఫోటోలు ఎప్పుడు ఇన్‌స్టాలో షేర్‌ చేసినా వైరల్‌ అవుతాయి. ఈసారి కూడా మిల్కీ బ్యూటీ తమన్నా తన అందంతో వైరల్‌ అవుతోంది. ఆకట్టుకునే అందంతో పాటు స్టైలింగ్‌ విషయంలో తమన్నా ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటుంది. ఈసారి కూడా బ్లాక్ డ్రెస్‌లో మెరిసి పోతున్న తమన్నాకి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

Tags:    

Similar News