వీడియో: పెళ్లి త‌ర్వాత తాప్సీ రెబ‌లిజం

పెళ్లి స‌మ‌యంలో లీకైన కొన్ని ఫోటోల సాయంతో అస‌లు విష‌యం తెలుసుకోవాల్సి వ‌చ్చింది కానీ తాప్సీ విష‌యంలో ప్ర‌తిదీ ఒక ర‌హ‌స్యం.

Update: 2024-05-23 14:14 GMT

ఇటీవ‌లే త‌న ప్రియుడు మాథియాస్ బోని పెళ్లాడింది తాప్సీ. ఐదారేళ్ల పాటు త‌న ప్రేమాయణం గురించి ఏనాడూ ఓపెన్ కాని తాప్సీ ప‌న్ను చివ‌రికి క్రీడాకారుడితో ప్రేమాయ‌ణాన్ని అంగీక‌రించింది. కానీ పెళ్లాడే ముందు క‌నీసం త‌న పెళ్లి శుభ‌లేఖ‌ను కూడా ఎవ‌రికీ పంచ‌లేదు. పెళ్లి చేసుకుంటున్నాన‌ని క‌నీస హింట్ కూడా ఇవ్వ‌లేదు. పెళ్లి స‌మ‌యంలో లీకైన కొన్ని ఫోటోల సాయంతో అస‌లు విష‌యం తెలుసుకోవాల్సి వ‌చ్చింది కానీ తాప్సీ విష‌యంలో ప్ర‌తిదీ ఒక ర‌హ‌స్యం.

ఇక పెళ్లి త‌ర్వాత మాత్రం త‌న పెళ్లి ఫోటోలు వీడియోల‌ను షేర్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అవి కూడా ప‌రిమితంగానే.. తాను త‌న ప్రియుడు పూర్తిగా ప్ర‌యివేటు వ్య‌క్తులం అని ప్ర‌తిదీ బ‌హిరంగంగా చెప్పుకునే అల‌వాటు లేద‌ని తాప్సీ అంది. అదంతా అటుంచితే పెళ్లి త‌ర్వాత తాప్సీ ప‌న్ను న‌టిస్తుందా న‌టించ‌దా? అన్న‌దానికి ఇప్ప‌టికే స‌మాధానం వ‌చ్చింది. పెళ్లి త‌ర్వాత తాప్సీ న‌ట‌నా కెరీర్ కి ఎలాంటి ఆటంకం లేదు. బ్యాడ్మింట‌న్ కోచ్ మాథియాస్ బో నుంచి త‌న‌కు అన్నివిధాలా అనుమ‌తులు ల‌భించాయి. ఇప్ప‌టికే ప్రియుడిని త‌న కొంగున క‌ట్టేసుకుంద‌ని కూడా గుసగుస‌లు వినిపిస్తున్నాయి.

Read more!

అదంతా అటుంచితే తాజాగా తాప్సీ ప‌న్ను షేర్ చేసిన ఓ వీడియో షూట్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. ఇందులో పాపుల‌ర్ బ్రాండ్ ఇన్న‌ర్ దుస్తుల‌ను తాప్సీ ప్ర‌మోట్ చేస్తోంది. ఇన్న‌ర్స్ ధ‌రించి అల్ట్రా స్టైలిష్ ఫోజుల‌తో తాప్సీ గుబులు రేపుతోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో అభిమానుల్లో వైర‌ల్ గా మారుతోంది. పెళ్లి త‌ర్వాతా తాప్సీ రెబ‌ల్ గా మారింది అంటూ అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కానీ ఈ వాణిజ్య‌ ప్ర‌క‌ట‌న తాప్సీకి బిగ్ డీల్. పాపుల‌ర్ బ్రాండ్ తో బిగ్ సైజ్ ఒప్పందం కుదుర్చుకుంద‌ని కూడా మాట్లాడుకుంటున్నారు. మ‌రోవైపు తాప్సీ న‌టిగానే కాకుండా నిర్మాత‌గాను సొంత బ్యాన‌ర్ లో సినిమాలు తీసేందుకు సిద్ధ‌మైంది. దీనికోసం భారీగా పెట్టుబ‌డులు పెట్టేందుకు ప్ర‌ణాళిక‌ల్లో ఉంది.



Tags:    

Similar News