సూర్య తెలుగు సినిమా టైటిల్ ఇదే...!
లక్కీ భాస్కర్ సినిమాతో గత ఏడాది సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా సినిమా రూపొందబోతుంది.;
తమిళ్‌తో పాటు తెలుగులో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో సూర్య. తెలుగులో సుదీర్ఘ కాలంగా ఈయన సినిమాలు డబ్ అవుతూ వస్తున్నాయి. చాలా కాలం నుంచి ఒక తెలుగు సినిమాను చేయాలని భావిస్తున్నట్లు సూర్య చెబుతూ వచ్చాడు. ఎట్టకేలకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగవంశీ నిర్మాణంలో సూర్య హీరోగా ఒక తెలుగు సినిమా రూపొందబోతోంది. లక్కీ భాస్కర్ సినిమాతో గత ఏడాది సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా సినిమా రూపొందబోతుంది. గత నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా విడుదల కాబోతుంది.
విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శకుడు వెంకీ అట్లూరి చెబుతున్నాడు. లక్కీ భాస్కర్ వంటి సబ్జెక్ట్‌ను తీసుకుని, దాన్ని కమర్షియల్ గా హిట్ చేసిన ఘనత వెంకీ అట్లూరికి దక్కుతుంది. అందుకే ఆయన నుంచి రాబోతున్న సినిమా అనగానే అంచనాలు పెరుగుతున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారు. సినిమాను తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా రూపొందించబోతున్నారు. ఇక అన్ని భాషల్లోనూ డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. అన్ని భాషలకు సరిపోయే విధంగా ఈ సినిమాకు విభిన్నమైన టైటిల్‌ను అనుకుంటున్నారు. తమిళ సినీ వర్గాలతో పాటు, టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు 'విశ్వనాథన్ అండ్ సన్స్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.
లక్కీ భాస్కర్ అంటూ దుల్కర్ సల్మాన్ సినిమాకు టైటిల్ అనుకున్నప్పుడు చాలా మంది ఇదేం టైటిల్ అనుకున్నారు. కథకు తగ్గట్లుగా సినిమాకు టైటిల్‌ను పెట్టడంలో వెంకీ అట్లూరి చాలా ముందు ఉంటాడు. అందుకే ఆయన ఈ సినిమాకు విశ్వనాథన్ అండ్ సన్స్ టైటిల్ అనుకుంటున్నాడు అంటే కచ్చితంగా అందుకు తగ్గ మ్యాటర్ ఉండే ఉంటుంది. ఈ మధ్య కాలంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా అంటే మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా విషయంలోనూ అదే జరుగుతుంది. పైగా ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కారణంగా కేవలం సౌత్‌లోనే కాకుండా మొత్తం నార్త్ ఇండియాలోనూ సినిమాకు మంచి స్పందన దక్కే అవకాశాలు ఉన్నాయి.
విశ్వనాథన్ అండ్ సన్స్ టైటిల్ తో ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమాలో సూర్యకు జోడీగా మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుంది. తమిళ్‌కు చెందిన ప్రముఖ నటీనటులతో పాటు, తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. కొన్ని సీన్స్‌ను రెండు భాషల్లోనూ వేరు వేరుగా చిత్రీకరణ చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని కామెడీ సీన్స్ కోసం రెండు యూనిట్స్ షూట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సూర్య తెలుగులో చేస్తున్న మొదటి సినిమా కనుక అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తమిళ హీరోలు తెలుగు లో చేస్తూ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ధనుష్ సార్, కుబేర సినిమాలతో తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కనుక సూర్య సినిమాకు ముందస్తుగా పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది.