స్ట్రాంగ్ కంబ్యాక్ తర్వాత హ్యాట్రిక్‌పై కన్నేసిన హీరో!

కొంతకాలంగా సరైన బాక్సాఫీస్ స‌క్సెస్ ను అందుకోవడం కోసం ఎదురుచూసిన సూర్యకు 2026 సంవత్సరం కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.

Update: 2026-08-25 22:30 GMT

కొంతకాలంగా సరైన బాక్సాఫీస్ స‌క్సెస్ ను అందుకోవడం కోసం ఎదురుచూసిన సూర్యకు 2026 సంవత్సరం కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఈ ఇయ‌ర్ వచ్చిన క‌రుప్పుతో స్ట్రాంగ్ స‌క్సెస్‌ను అందుకున్న ఆయన, ఆ తర్వాత తాజాగా విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ తో మరోసారి తన మార్కెట్‌ స్టామినాను చాటుకున్నారు. వరుస స‌క్సెస్‌ల‌తో సూర్య కెరీర్‌లో మళ్లీ పాజిటివ్ వైబ్ కనిపిస్తుండగా.. ఇప్పుడిదే ఏడాదిలో మూడోసారి ప్రేక్షకుల ముందుకు రావాలనే ప్రయత్నం ఆసక్తిని పెంచుతోంది.

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి రావడానికి చాలా టైమ్ పడుతుంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, రిలీజ్ విండో ఇలా అనేక అంశాల కారణంగా ఏడాదికి ఒక సినిమాతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కానీ సూర్య విషయంలో ప్రస్తుతం పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలతో ఆడియ‌న్స్ ను పలకరించిన ఆయన.. మూడో ప్రాజెక్ట్‌ను కూడా ఇదే ఏడాదిలో థియేటర్లలోకి తీసుకురావాలని చూస్తుండటం కెరీర్‌లో స్పెష‌ల్ ఫేజ్‌గా మారింది.

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం సూర్య సినిమాల ఎంపిక. వరుస స‌క్సెస్‌లు వచ్చిన వెంటనే అదే తరహా కథల వైపు వెళ్లకుండా.. విభిన్నమైన డైరెక్ట‌ర్లు, క్యారెక్ట‌ర్లు, జానర్లతో ముందుకు సాగుతున్న తీరు కనిపిస్తోంది. దీంతో సక్సెస్ ఇచ్చిన ఫార్ములాను రిపీట్ చేయడం కంటే.. తన మార్కెట్‌ను మరింత విస్తరించాలనే ఆలోచనలో సూర్య ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక ప్రస్తుతం డిస్క‌ష‌న్ లో ఉన్న సూర్య‌47 కూడా ఈ విషయంలో ప్రత్యేకంగా నిలుస్తోంది. జీతూ మాధవన్ డైరెక్ష‌న్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. నజ్రియా నజీమ్, నస్లెన్ కీలక పాత్రల్లో నటించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. షూటింగ్ పూర్తవడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

దీపావళి వంటి పెద్ద పండుగ సీజన్‌ను సూర్య తన నెక్ట్స్ మూవీ రిలీజ్‌కు వాడుకుంటే, అది కేవలం సినిమా రిలీజ్ మాత్ర‌మే కాకుండా మార్కెట్‌ను మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నంగా కూడా మారే అవకాశం ఉంది. అదే సమయంలో పండుగ బరిలో పలువురు తమిళ హీరోల సినిమాలు కూడా ఉండే అవకాశముండటంతో పోటీ ఆసక్తికరంగా మారనుంది. మొత్తానికి వరుస స‌క్సెస్‌ల‌తో వచ్చిన నమ్మకాన్ని సూర్య ఇప్పుడు వేగంగా సినిమాలు పూర్తి చేయడం, కొత్త కాంబినేషన్లను ఎంచుకోవడం, సరైన రిలీజ్ విండోను టార్గెట్ చేయడం ద్వారా కంటిన్యూ చేస్తున్న‌ట్టు కనిపిస్తోంది. 2026లో రెండు స‌క్సెస్‌ల తర్వాత మూడో సినిమాతోనూ సక్సెస్ అందుకుంటే.. ఈ ఏడాది సూర్య కెరీర్‌లోనే ఒక స్పెష‌ల్ స‌క్సెస్‌ఫుల్ ఫేజ్ గా నిలిచే అవకాశముంది.

Tags:    

Similar News