ఇద్దరు లెజెండ్స్ మధ్య గ్యాప్ అలా!
సూపర్ స్టార్ కృష్ణ- గాయకుడు ఎస్ . పి బాలసుబ్రమణ్యం కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కృష్ణ నటించిన ఎన్నో సినిమాలకు బాలు ఆలపించారు.;
సూపర్ స్టార్ కృష్ణ- గాయకుడు ఎస్ . పి బాలసుబ్రమణ్యం కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కృష్ణ నటించిన ఎన్నో సినిమాలకు బాలు ఆలపించారు. ఇద్దరు ఒకర్ని ఒకరు అంతే అభిమానించుకునే వారు వారు. అయితే వారి మధ్య కూడా చిన్నపాటి పొరపొచ్చాలు ఉండేవి? అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణకి కోపం రావడంతో ఏకంగా బాలుని కొన్నాళ్ల పాటు పక్కనే బెట్టారు? అన్న విషయం తెరపైకి వచ్చింది.ఈ విషయాన్ని సంగీత దర్శకుడు సాలూరి వాసురావు రివీల్ చేసారు.
బాలు-వాసు ఇద్దరు అప్పట్లో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. వాసు పెళ్లి దగ్గరుండి జరిపించింది కూడా బాలునే. ఈ విషయాన్ని వాసు తెలిపారు. పెళ్లి చూపులు మొదలు పెళ్లి తంతు పూర్తయ్యే వరకూ బాలు దగ్గరున్నారు. అలా చేయడమే బాలుని కృష్ణకు దూరం చేసినట్లు అయింది. ఇద్దరికీ గ్యాప్ రావడానికి కారణం తానే అంటూ పేర్కొ న్నారు. వాసు పెళ్లి రోజు- కృష్ణ పుట్టిన రోజు ఒకే రోజు అట. ఆ సమయంలో కృష్ణ `ఈనాడు` సినిమా చేస్తున్నారు. అదే రోజు టైటిల్ సాంగ్ గురించి బాలుని రమ్మని కృష్ణ పిలిచారుట. కానీ బాలు వాసు పంక్షన్ లో బిజీగా ఉన్నానని..ఇప్పుడు రావడం కుదరదని చెప్పారుట.
దీనికి సంబంధించి మధ్యవర్తిత్వం చేసింది హనుమంతురావు. ఆయన కబురు చేయడంతోనే విషయం బాలుకు తెలిసింది. అయితే బాలు రాలేనని చెప్పేసరికి కృష్ణ కోపగించుకున్నారుట. ఆ కోపంతో? బాలును తప్పించి ముంబై నుంచి అప్పటికప్పుడు కిశోర్ కుమార్ ను పిలిపించి పాట పాడించినట్లు గుర్తు చేసుకున్నారు వాసు. దీంతో చాలా కాలం పాటు ఆ తర్వాత కృష్ణ నటించిన సినిమాలకు బాలు పాటలు పాడలేకపోయారన్నారు. బాలు మనసులో ఎలాంటి దురుద్దేశం లేకపోయినా? కేవలం రాలేదు అన్న కోపంతోనే కృష్ణగారు అప్పట్లో ఫీలైనట్లు తెలిపారు.
అయితే బాలు చివరి సారిగా `డియర్ కృష్ణ` అనే టైటిల్ తో తెరకెక్కిన ఓ సినిమాకు పాటలు పాడటం విశేషం. సూపర్ స్టార్ కృష్ణ కు ఆ సినిమాతో సంబంధం లేకపోయినా `కృష్ణ` టైటిల్ తో ఉన్న సినిమాకు పాటలు పాడటం విశేషం. ఈ పాటను అప్పట్లో మలయాళం స్టార్ మోహన్ లాల్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.