'సుందరకాండ' సెన్సార్ టాక్ ఎలా ఉందంటే?
టాలీవుడ్ హీరో నారా రోహిత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ హీరో నారా రోహిత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. రీసెంట్ గా భైరవం మూవీతో సందడి చేశారు. ఆ సినిమాలో తన యాక్టింగ్ తో మెప్పించారు. ఇప్పుడు సుందరకాండ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ రొమాంటిక్ డ్రామాను సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. శ్రీదేవి విజయ్ కుమార్, విర్తి వాఘని హీరోయిన్లుగా నటిస్తున్నారు. నరేష్, వాసుకి ఆనంద్, సత్య, అజయ్, అభినవ్ గోమఠం కీలక పాత్రలు పోషించారు.
అయితే వినాయక చవితి పండుగ సందర్భంగా ఆగస్టు 27వ తేదీన రిలీజ్ కానున్న నారా రోహిత్ ల్యాండ్ మార్క్ 20వ సినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుంది. రిలీజ్ కు సిద్ధమైంది. ఇటీవల ఎలాంటి కట్స్ లేకుండా సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) నుంచి క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ అందుకుంది.
సినిమా రన్ టైమ్ 2 గంటల 15 నిమిషాలకు లాక్ చేయగా, ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సార్ టాక్ వైరల్ గా మారింది. అనుకూలమైన సెన్సార్ టాక్ ను పొందిందట మూవీ. టాక్ ప్రకారం, మూవీ సాంకేతికంగా చాలా బాగుంది. క్లీన్ ఫ్యామిలీ డ్రామాగా తీశారు మేకర్స్. నారా రోహిత్ పాత్రను అద్భుతంగా డైరెక్టర్ డిజైన్ చేశారు.
వెంకటేష్ నిమ్మలపూడి ప్రేమకథలపై పరిణతి చెందిన టేక్ ను అందించారు. మొదటి సగం రెండు ప్రేమకథలతో సజావుగా సాగుతుంది. రెండవ సగం షాకింగ్ ఇంటర్వెల్ ట్విస్ట్‌తో ప్రారంభమవుతుంది. ఊహించని ట్విస్ట్, సెకండాఫ్ మాస్టర్ ఫుల్ రైటింగ్, ఎగ్జిక్యూషన్ అవసరం కాగా, డైరెక్టర్ చక్కగా డీల్ చేశారని సమాచారం.
నారా రోహిత్ చాలా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. లియోన్ జేమ్స్ సంగీతం ఈ చిత్రానికి మరో హైలైట్. ఎందుకంటే అన్ని పాటలు బాగున్నాయి. సెకండాఫ్ లో వచ్చిన సాంగ్స్ అన్నీ ప్రత్యేకంగా నిలుస్తాయి. చాలా ఆకర్షణీయమైన కథనంతో కూడిన కామెడీ అందరినీ ఆకట్టుకుంటుందని సెన్సార్ సభ్యులు చెప్పారట. మరి సుందరకాండ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.