సమ్మర్ వార్ కు అందాల భామలు రెడీ.. విన్నర్ ఎవరో?

టాలీవుడ్‌ లో పండుగ సీజన్లంటే హీరోల మధ్య పోటీ మాత్రమే కాదు.. ఇప్పుడు హీరోయిన్ల మధ్య గ్లామర్ వార్ కూడా హాట్ టాపిక్‌ గా మారుతోంది.;

Update: 2026-03-21 02:30 GMT

టాలీవుడ్‌ లో పండుగ సీజన్లంటే హీరోల మధ్య పోటీ మాత్రమే కాదు.. ఇప్పుడు హీరోయిన్ల మధ్య గ్లామర్ వార్ కూడా హాట్ టాపిక్‌ గా మారుతోంది. సంక్రాంతి సీజన్‌ లో ఎలా అందాల భామలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద తలపడ్డారో.. ఇప్పుడు సమ్మర్ సీజన్ కూడా అదే ట్రెండ్‌ ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, ఆషిక రంగనాథ్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య వంటి పలువురు హీరోయిన్లు థియేటర్స్ లో సందడి చేశారు. తమ తమ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈసారి కూడా అదే తరహాలో సమ్మర్ సీజన్‌ లో గ్లామర్ డోస్ పెంచేలా స్టార్ హీరోయిన్లు వరుసగా రంగంలోకి దిగుతుండడం విశేషం.

ఇప్పటికే ఆ సమ్మర్ వార్‌ ను స్ట్రాంగ్ గా స్టార్ట్ చేయడానికి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సిద్ధమవుతున్నారు. ఆమె నటిస్తున్న పెద్ది సినిమా విడుదలకు సిద్ధంగా ఉండటంతో ఆ గ్లామర్ రేస్‌ కు స్టార్టింగ్ సిగ్నల్ పడినట్టే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ మూవీని బుచ్చిబాబు సనా.. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు

ఇక జాన్వీ కపూర్ తర్వాత వరుసగా పలువురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అందులో ముఖ్యంగా మృణాల్ ఠాకూర్ పేరు ముందుంటుంది. ఇటీవల వరుస హిట్లతో టాలీవుడ్‌ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆమె.. సమ్మర్‌ లో డెకాయిట్ మూవీతో మ్యాజిక్‌ ను రిపీట్ చేయాలని చూస్తోంది. అలాగే సంయుక్త మీనన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

గత కొంతకాలంగా వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న ఆ మలయాళ భామ.. ఈసారి కూడా స్వయంభూ మూవీతో అదే జోరు కొనసాగించాలని భావిస్తున్నారు. మరోవైపు గ్లామర్ డోస్‌ తో ప్రేక్షకులను ఆకట్టుకునే నభా నటేష్ కూడా సమ్మర్ రేస్‌ లో ఉంది. కొంత గ్యాప్ తర్వాత తిరిగి ఫుల్ ఫామ్‌ లోకి రావడానికి ఆమెకు నాగబంధం సినిమా కీలకంగా మారనుంది. భాగ్యశ్రీ బోర్సే కూడా గ్లామర్ వార్‌ లో తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు.

అలా సమ్మర్ సీజన్‌ లో కేవలం సినిమాల మధ్య పోటీ మాత్రమే కాకుండా.. హీరోయిన్ల మధ్య గ్లామర్ పోటీ ఆసక్తికరంగా మారనుంది. ప్రతి హీరోయిన్ స్క్రీన్ ప్రెజెన్స్‌ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండటంతో.. ఈ సినీ సమ్మర్ మరింత కలర్‌ ఫుల్‌ గా మారనుంది. మరి ఎవరు ఎక్కువగా ఆకట్టుకుంటారు? ఎవరి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటుంది? అన్నది తెలియాలంటే సమ్మర్ ముగిసే వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News