ఎట్టకేలకు మొదలైన వారసురాలి చిత్రం!
తాజాగా ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. ఇందులో సుహానా ఖాన్ సహా ప్రధాన తారగణమంతా పాల్గొంది. అయితే షారుక్ మాత్రం హాజరవ్వలేదు.;
షారుక్ ఖాన్ కుమార్తె సుహానాఖాన్ ప్రధాన పాత్రలో సిద్దార్ద్ ఆనంద్ దర్శకత్వంలో 'కింగ్' చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో షారుక్ ఖాన్ కీలక పాత్రతో పాటు దీపికా పదుకణే , అభిషేక్ బచ్చన్, అర్షద్ వార్షీ, జాకీ ష్రాప్, సహా పలువురు స్టార్ నటీనటులు భాగమవుతున్నారు. అనీల్ కపూర్ కూడా ఓ కీలక పాత్ర పోసిస్తున్నట్లు వార్త లొస్తున్నాయి. ఈ సినిమా గురించి కొన్ని నెలలుగా నెట్టింట ప్రచారం పీక్స్ లో జరుగుతుంది.
కానీ స్టేటస్ ఏంటి? అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఇటీవలే నటీనటుల వివరాలు బయటకు రావడంతో కొన్ని విషయాలు తెలిసాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. ఇందులో సుహానా ఖాన్ సహా ప్రధాన తారగణమంతా పాల్గొంది. అయితే షారుక్ మాత్రం హాజరవ్వలేదు. ఆయనపై సన్నివే శాలు రెండవ షెడ్యూల్ నుంచి ప్లాన్ చేసారుట. దీనిలో భాగంగా షారుక్ లేకుండానే తొలి షెడ్యూల్ మొదలైంది. దీంతో షారుక్ అభిమానుల్లో సంతోషం మొదలైంది.
వారసురాల్ని తెరపైకి తేడంతో సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. వాస్తవానికి షారుక్ నట వారసత్వాన్ని తనయుడు ఆర్యన్ ఖాన్ తీసుకోవాలి. కానీ ఆర్యన్ క్రియేటివ్ గా...డైరెక్టర్ గా రాణించాల నుకుంటున్నాడు. ఇప్పటికే సొంత ప్రొడక్షన్ హాస్ లో ఓ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నాడు. అలా ఆర్యన్ డైరెక్టర్ అవుతున్నాడు. మరి ఆ రంగంలో అతడు ఏ స్థాయికి వెళ్తాడో చూడాలి. దీంతో షారుక్ నట ఆశలన్నీ కుమార్తెపైనే పడ్డాయి.
షారుక్ దేశంలోనే పెద్ద స్టార్. నటుడిగా ఆయనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆయన వారసత్వం అంటే? ఆ లెగస్సీని కొనసాగించాలి. మరి సుహానాఖాన్ అంతటి ప్రతిభావంతురా? కాదా? అన్ని కాలం నిర్ణయిస్తుంది. నటిగా మాత్రం ఇప్పటికే రకరకాల శిక్షణలు పూర్తి చేసింది.