35 కోట్ల విలువైన కొకైన్‌తో న‌టుడు.. స‌మీర్ వాంఖ‌డే ఎక్క‌డ‌?

అయితే ఇప్పుడు `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌`లో సహాయక పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు ఒక‌రు చెన్నై విమానాశ్రయంలో రూ. 35 కోట్ల విలువైన 3.5 గ్రాముల కొకైన్‌తో పట్టుబడ్డార‌ని మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి.;

Update: 2025-10-01 08:58 GMT

ముంబైలో జ‌రిగిన‌ క్రూయిజ్ షిప్ పార్టీలో కింగ్ ఖాన్ షారూఖ్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ తో ప‌ట్టుప‌ట్టాడంటూ ఎన్సీబీ అధికారి స‌మీర్ వాంఖ‌డే అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. 2021లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న గురించి ఇప్ప‌టికీ అభిమానుల్లో చ‌ర్చ సాగుతూనే ఉంది. ఆర్య‌న్ తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని నిరూపించి, జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఈ రెండున్న‌రేళ్ల‌లో ఆర్య‌న్ ఖాన్ తాను ద‌ర్శ‌కుడిగా నిరూపించుకునేందుకు చాలా శ్ర‌మిస్తున్నాడు.

ఆర్య‌న్ తెర‌కెక్కించిన మొద‌టి వెబ్ సిరీస్ `ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్` ఇటీవ‌లే విడుద‌లై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. నెట్ ఫ్లిక్స్ లో అద్భుత‌మైన ఆద‌ర‌ణ పొందుతోంది. అయితే ఈ సిరీస్ లో త‌న‌ను కించ‌ప‌రుస్తూ ఒక పాత్ర‌ను చూపించార‌ని ఆర్య‌న్ ని అరెస్ట్ చేసిన‌ మాజీ ఎన్సీబీ చీఫ్ సమీర్ వాంఖడే నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌పై పరువు నష్టం కేసు వేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అయితే ఇప్పుడు `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌`లో సహాయక పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు ఒక‌రు చెన్నై విమానాశ్రయంలో రూ. 35 కోట్ల విలువైన 3.5 గ్రాముల కొకైన్‌తో పట్టుబడ్డార‌ని మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. ఈ వార్త తెలియగానే నెటిజనులు స్పందిస్తూ.. ``వాంఖడే ఎక్కడ? ఆ న‌టుడి పేరును బ‌హిర్గ‌తం చేయాలి!`` అంటూ డిమాండ్ చేసారు.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ వంటి సినిమాల్లో అతడు ఒక‌ చిన్న పాత్ర పోషించాడని మాత్రమే వార్తా క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. సింగపూర్ నుండి తిరిగి వస్తున్నప్పుడు సాధారణ తనిఖీల సమయంలో ఆ నటుడిని కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. అతని ట్రాలీ దిగువన దాచిన కంపార్ట్‌మెంట్‌లో తెల్లటి పొడితో నిండిన ప్లాస్టిక్ పౌచ్‌లను కనుగొన్నారు. ఆ పదార్థం కొకైన్ అని ప‌రీక్ష‌లో నిర్ధారించారు. క‌స్ట‌మ్స్ తో క‌లిసి డిఆర్వో అధికారులు నిర్వ‌హించిన సంయుక్త ఆప‌రేషన్ ఇది.

అయితే ఆప‌రేష‌న్ లో ప‌ట్టుబ‌డ్డ న‌టుడు ఆ బ్యాగ్ త‌న‌ది కాద‌ని క‌స్ట‌మ్స్ అధికారుల‌తో వాదించాడు. కానీ అది అత‌డి బ్యాగ్. కంబోడియాలోని ఒక వ్యక్తి నుండి అత‌డికి చేరుకుంది. చెన్నై విమానాశ్రయంలో ఒక‌రికి దానిని డెలివరీ చేయమని కాంబోడియా వ్య‌క్తి అత‌డిని అడిగాడు. అయితే డ్రగ్స్ రవాణా చేయడానికి ముంబై, ఢిల్లీ వంటి నగరాలకు ఈ న‌టుడు వెళ్లి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు. అత‌డు నిజంగానే డ్ర‌గ్స్ ముఠాలో భాగ‌మా? గ‌తంలో స్మ‌గ్లింగ్ కి పాల్ప‌డ్డాడా? అనేది నిర్ధారించ‌డానికి అత‌డి ప్ర‌యాణ డేటాను ప‌రిశీలిస్తున్నారు.

అయితే `స్టూడెంట్ ఆప్ ది ఇయ‌ర్` న‌టుడు ప‌ట్టుబ‌డినా కానీ, పోలీసులు అత‌డి గురించిన వివ‌రాలు బ‌య‌ట‌కు చెప్పం లేదు. క‌నీసం అత‌డి ఫోటోను కూడా బ‌య‌ట‌పెట్ట‌లేదు. దీంతో ప్ర‌జ‌లు ఆర్యన్ కి ఒక రూల్... అత‌డికి ఇంకొక రూల్.. పాటిస్తున్నార‌ని విరుచుకుప‌డుతున్నారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ న‌టుడి ఐడెంటిటీని బ‌హిర్గ‌తం చేయాల‌ని నెటిజ‌నులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్యన్ ఖాన్ ఫోటో పేరును ప్రచురించవచ్చు.. అక్క‌డ‌ 3.5 కిలోల కొకైన్‌తో ఒకరిని అరెస్టు చేసినా పేరు లేదు, ఫోటో లేదు. వాంఖడే ఎక్కడ?`` అని నెటిజ‌నులు ప్రశ్నించారు. ఆర్య‌న్ ఖాన్ పై ప‌రువు న‌ష్టం కేసులో స‌మీర్ వాంఖ‌డేకు వ్య‌తిరేకంగా దిల్లీ హైకోర్టు ఇటీవ‌ల‌ తీర్పును వెలువ‌రించ‌డం హాట్ టాపిగ్గా మారింది.

Tags:    

Similar News