SSMB 29 విల‌న్ ఎవ‌రో చివ‌రి వ‌ర‌కూ క‌నిపెట్ట‌లేరు!

ఇండియా మోస్ట్ అంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ గా మహేశ్ బాబు- రాజమౌళి సినిమా తెరకెక్కుతుంది. SSMB 29 వర్కింగ్ టైటిల్ తో ఇది రూపొందుతుంది.;

Update: 2025-07-19 09:39 GMT

ఇండియా మోస్ట్ అంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ గా మహేశ్ బాబు- రాజమౌళి సినిమా తెరకెక్కుతుంది. SSMB 29 వర్కింగ్ టైటిల్ తో ఇది రూపొందుతుంది. ఈ సినిమా ప్రకటన చేసినప్పటి నుంచీ సోషల్ మీడియా, ఇంటర్నెట్ లో SSMB 29 రోజూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది.

అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయలేదు. సినిమా స్టోరీ ఏంటి, షూటింగ్ ఎంత వరకూ వచ్చింది, పోస్టర్ రిలీజ్ వంటి ఎలాంటి అప్డేట్స్ లేవు. అందుకే సినిమా నుంచి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా, అది క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా గురించి కీలక మ్యాటర్ బయటకు వచ్చింది.

ఈ ప్రాజెక్ట్ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాగా తెరకెక్కుతుందని వెల్లడైంది. ఈ సినిమా స్టోరీ లైన్ ఇది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇన్ని రోజులు ఇది అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే కథ గా తెరకెక్కుతుందని ప్రచారం సాగింది. కానీ, పక్కా స్టోరీ లైన్ ఎవరికీ తెలీదు. అయితే ఇది ఇండియానా జోన్స్, ఆఫ్రికన్ అడ్వెంచర్ క్లాసిక్‌ల నుండి ప్రేరణతో తెరకెక్కిస్తున్నారని తెలిసింది.

అంతేకాదు అనేక ఏళ్లుగా దాగి ఉన్న రహస్యాన్ని ఛేదించే ఓ అన్వేషకుడి కథగా ఇది సిద్ధమవుతోంది. ఒక అన్వేషన యాత్రగా సాగే ఈ కథలో రహస్యాలు, మోసాలు, ప్రకృతి విపత్తులతోపాటు పురాతన ఇతిహాసాలు జోడించనున్నారు. ఇలా ప్రేక్షకులకు ఆసాంతం థ్రిల్లింగ్ పంచే ఈ కథలో విలన్ ఎవరో కూడా రివీల్ కాదంట. క్లామాక్స్ వరకు నెగెటివ్ రోల్ డిస్ క్లోజ్ చేయకుండా ఆడియెన్స్ ను సస్పెన్స్ చేయనున్నారు.

కాగా, ఈ నెల రెండో వారంలో కెన్యాలో షూటింగ్ జరగాల్సి ఉంది. కానీ, అక్కడి పరిస్థితుల వల్ల ఈ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది. దీంతో మేకర్స్ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ నెల మూడవ వారంలో సెరెంగేటిలో కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తారని, ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో షూటింగ్ చేయనున్నారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా కోసం మహేశ్ అనేక వర్కౌట్ లు చేస్తున్నారు. ప్రాజెక్ట్ కోసం లుక్ కూడా బయటకు రిలీల్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా దుర్గా బ్యానర్ పై కే ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News