ఆ హీరోలంతా కూడా 'వారణాసి' మార్గంలోనే!
తాజా సినిమా వారణాసి నేపథ్యమంతా కూడా అడవుల్లోనే. దీంతో ఈ ఇమేజ్ మిగతా చిత్రాలకు పాజిటివ్ అంశంగా మారుతోంది.;
ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ `ఎస్ ఎస్ ఎంబీ 29 వారణాసి`. ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆప్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ కావడంతో? అభిమానుల్లో అంతకంకతు ఎగ్జైట్ మెంట్ రెట్టింపు అవుతోంది. సాహసకుడిగా మహేష్ ఎలా కనిపిస్తాడు? జక్కన్న మేకింగ్ ఎలా ఉంటుంది? స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఎంత గొప్ప కథ అందించారు? ఇలా ఎన్నో డిస్కషన్స్ సర్వాత్రా జరుగుతున్నాయి. ఇదంతా పక్కన బెడితే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ సినిమాలు పాన్ ఇండియాలో సంచలన విజయాలు నమోదు చేయడం మరో ఇంట్రెస్టింగ్ విషయం.
గత విజయాల ఊపుతో:
`పుష్ప` రెండు భాగాలు ఇండియాని ఏ రేంజ్ లో ఊపేసాయో తెలిసిందే. అంతకు ముందు `ఆర్ ఆర్ ఆర్` తో జక్కన్న అదే మ్యాజిక్ చూపించారు. ఆ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డే సాధించింది. పాన్ వరల్డ్ లోనే సంచలన చిత్రంగా నిలిచింది. ఈ రెండు చిత్రాల్లోనూ అడవుల నేపథ్యం ఉంటుంది. పుష్పరాజ్ పాత్ర, కొమరంభీమ్ పాత్ర లకు సంబంధించి కథ అంతా అడవిలోనే సాగుతుంది. కన్నడ చిత్రం `కాంతార` రెండు భాగాలు కూడా అడవి నేపథ్యంలో సాగే కథలే. అడవి దేవత నేపథ్యానికి కమర్శియల్ హంగులు అద్ది చేసిన చిత్రాలవి.
వారణాసి తోనే బజ్ మొదలు:
తాజా సినిమా వారణాసి నేపథ్యమంతా కూడా అడవుల్లోనే. దీంతో ఈ ఇమేజ్ మిగతా చిత్రాలకు పాజిటివ్ అంశంగా మారుతోంది. యువ సామ్రాట్ నాగచైతన్య కథానాయకుడిగా కార్తక్ దండు `వృషకర్మ` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదొక మిస్టికల్ థ్రిల్లర్. గుహ నేపథ్యంలో సాగే కథ ఇది. దీంతో ఈ సినిమా కు అడవి నేపథ్యంలో కొంత కథ సాగుతుందని తెలుస్తోంది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ వర్మ ఓ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథ కూడా కొంత ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోసాగుతుందని వార్తలొస్తున్నాయి.
అడవి బాట పట్టిన హీరోలు:
ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు కర్ణాటక ఫారెస్ట్ లో చిత్రీకరిస్తారని వార్తలొస్తున్నాయి. మెగా మేనల్లుడు సాయితేజ్ నటిస్తోన్న `సంబరాల ఏటిగట్టు`కు అడవి నేపథ్యముంటుందని తెలిసింది. ప్రధాన పాత్రలపై కొన్ని కీలక సన్నివేశాలు అడవిలో చిత్రీకరించనున్నారుట. యంగ్ హీరో శర్వానంద్- దర్శకుడు సంపత్ నంది కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లోనే తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ తెలంగాణ యాసలో మాట్లాడుతాడని ఇప్పటికే ప్రచారంలో ఉంది.